భోజనం మానేస్తే బరువు తగ్గుతరా? వెయిట్ లాస్ గురించి ఇలాంటి విషయాలను అస్సలు నమ్మకండి
బరువు తగ్గడానికి కొంతమంది వ్యాయామాలు చేస్తే.. ఇంకొంతమంది మాత్రం తినడమే మానేస్తుంటారు. నిజంగా భోజనం మానేస్తే బరువు తగ్గుతారా? దీనివల్ల ఎలాంటి సమస్యలు రావా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా?
skipping food
మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి పోషకాహారం చాలా చాలా అవసరం. మంచి పోషకాలున్న సమతుల్య ఆహారాన్ని తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. మీకు తెలుసా? సమతుల్య ఆహారాన్ని తింటే మనకు గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు మంచి పోషకాహారం మన బరువును నియంత్రిస్తుంది. అలాగే శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.
weight loss
మనం ఆరోగ్యంగా ఉండటానికి వివిధ రకాల పండ్లను, తృణధాన్యాలను, సన్నని ప్రోటీన్లు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులను మన రోజువారి ఆహారంలో చేర్చాలి. ఆరోగ్యంగా ఉండటానికి ప్రాసెస్ చేసిన, చక్కెర ఆహారాలు, మందును తగ్గించాలి. మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకడానికి సరైన పోషకాహారం అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కానీ బరువు తగ్గాలనుకునే చాలా మంది భోజనాన్ని తినడమే మానేస్తున్నారు. ఇలా ఉంటే బరువు తగ్గుతామని నమ్ముతున్నారు. కానీ దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలొస్తాయి. అసలు బరువు తగ్గడం గురించి ఎలాంటి విషయాలను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
అపోహ : బరువు తగ్గడానికి భోజనాన్ని ఖచ్చితంగా మానేయాలా?
వాస్తవం: భోజనాన్ని మానేయడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే భోజనాన్ని మానేయడం వల్ల మీరు తర్వాత రోజు అతిగా తినే అవకాశముంది. అంతేకాదు దీనివల్ల మీ జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీనివల్ల మీరు బరువు తగ్గడం కష్టమవుతుంది. అందుకే బరువు తగ్గడానికి భోజనాన్ని మానేయడానికి బదులుగా రోజంతా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ జీవిక్రియ స్థిరంగా ఉంటుంది. అలాగే మీ శరీర శక్తి స్థాయిలు కూడా మెరుగ్గా ఉంటాయి.
అపోహ : కొవ్వులు తినడం బరువు పెరగడానికి సమానం
వాస్తవం: అవోకాడోలు, విత్తనాలు, కాయలు, ఆలివ్ నూనెలో అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే ఈ కొవ్వులు మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాల్లో ఉండే సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
అపోహ : శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా తేనె లేదా బెల్లం ఉపయోగించడం మంచిది
వాస్తవం: బెల్లం, తేనె లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శుద్ది చేసిన చక్కెరలకు మంచి ప్రత్యామ్నాయాలు. చక్కెర కంటే ఇవే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వీటిలో కూడా సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తిన్నా బరువు పెరుగుతారు కాబట్టి వీటిని కూడా లిమిట్ లోనే తీసుకోవాలి.
Weight loss
అపోహ : ఆరోగ్యకరమైన ఫుడ్ ఖరీదైంది
వాస్తవం: ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన వాటినే తినాలి. కానీ ఆరోగ్యకరమైన వాటిని కొనాలంటే డబ్బులు చాలా ఖర్చుపెట్టాలని చాలా మంది అంటుంటారు. కానీ హెల్తీ ఫుడ్స్ కు మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బీన్స్, కాయధాన్యాలు, బియ్యం, ఓట్స్, గుడ్లు, సీజనల్ పండ్లు, కూరగాయల్లో కూడా మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.