Health Tips: ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేయకండి.. ప్రమాదాలని కొని తెచ్చుకోకండి!
Health Tips: మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారాన్ని తీసుకుంటే పర్వాలేదు కానీ ఏ మాత్రం ఆహారంలో అశ్రద్ధ వహించినా అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆహారం విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం.
గత తరంలో భోజనానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. తినేముందు అది ఆరోగ్యానికి మంచిదా కాదా అని బేరీజు వేసుకునేవారు. సరైన సమయానికి సరియైన భోజనం చేస్తూ ఎంత వయసు పైబడినప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పటి తరం అందుకు పూర్తిగా వ్యతిరేకం.
సమయానుకూలంగా భోజనం చేయడం ఎప్పుడో మానేశారు. తినే తిండి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందో, అనారోగ్యాన్ని తెస్తుందో కూడా పట్టించుకోకుండా, ఆ నిమిషానికి ఏది తినాలనిపిస్తే అది తింటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఆహారం విషయంలో ఇలాంటి అలవాట్లు ఉంటే అది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇలాంటి అలవాట్లు లేకుండా చూసుకోండి. భోజనం విషయంలో మనం సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం ముగించాలి.
అలాగే రాత్రి భోజనం ఎంత తేలికగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. అంతేకానీ అర్ధరాత్రి 11 గంటలకు లేట్ నైట్ పార్టీలు అంటూ చికెన్లు మటన్లు తింటే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అలాగే విపరీతంగా జంక్ ఫుడ్ తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం.
కొందరు ఆ ఫుడ్ మీద ఇష్టంతో పరిమితికి మించి తినేస్తారు తినిన తర్వాత శరీరానికి సరిపడిన వ్యాయామం చేయకపోవడంతో స్థూలకాయానికి,ఆపై హృదయ సంబంధిత వ్యాధులకి మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుంది. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్ ఒంటికి అంత మంచిది కాదు.
అలాగే డిప్రెషన్ లో ఉన్నవాళ్లు ఎంత తింటున్నామో తెలియకుండా తింటూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి వారి తిండిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే అతిగా తినటం అనేది ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మనం అనుభవిస్తేనే కానీ తెలియదు. అంతదాకా తెచ్చుకునే కంటే ముందే జాగ్రత్త పడటం అవసరం.