MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • చర్మ క్యాన్సర్ రావొద్దంటే ఇలా చేయండి

చర్మ క్యాన్సర్ రావొద్దంటే ఇలా చేయండి

అతినీలలోహిత కిరణాలు మన చర్మ కణాలలోని డీఎన్ఏను నాశనం చేస్తాయి. ఇది క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. చర్మ క్యాన్సర్ వల్ల చర్మంపై చిన్న చిన్న మచ్చలతో పాటుగా..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 24 2023, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుత కాలంలో చర్మ క్యాన్సర్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ చర్మ క్యాన్సర్ కు ప్రధాన కారణం సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు. సూర్యుని అతినీలలోహిత కిరణాల ద్వారా కణాల డీఎన్ఏ నాశనం అవుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలలోని డీఎన్ఎను నాశనం చేస్తాయి. ఇది కణాల అనియంత్రిత పెరుగుదల, క్యాన్సర్ అభివృద్ధికి కారణమయ్యే ఉత్పరివర్తనాలకు దారితీస్తుంది. చర్మం రంగు మారడం, వైకల్యం, చర్మ గాయాలు, చిన్న మచ్చలు, చర్మపు పూతలతో చర్మ క్యాన్సర్ ను గుర్తించొచ్చు. చర్మ క్యాన్సర్ రాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
skin cancer

skin cancer

1. సాధ్యమైనంత వరకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండండి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీక్ అవర్స్ లో ఎక్కువ సేపు ఎండ తగలకుండా చూసుకోవాలి.

35

2. అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి సహాయపడే దుస్తులను వేసుకోండి. అంటే శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులను వేసుకోండి. 

3. బయటకు వెళ్లినప్పుడు హై spfతో సన్ స్క్రీన్ ఉపయోగించండి. spf 30 లేదా అంతకంటే ఎక్కువ బ్రాడ్-స్పెక్ట్రం సన్స్ స్క్రీన్ ను చర్మానికి పెట్టండి. అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి దీన్ని పెట్టండి. 
 

45

4. మీ చర్మాన్ని తరచుగా చెక్ చేస్తూ ఉండండి. అంటే మీ చర్మంపై ఏవైనా చిన్న చిన్న పుట్టుమచ్చలు లేదా మచ్చలు లేదా ఇతర మార్పులు ఉన్నాయేమో చేక్ చేయండి. ఎందుకంటే ఇవి చర్మ క్యాన్సర్ లక్షణాలు. 

5. బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ను తప్పకుండా పెట్టుకోండి. ఎందుకంటే ఇవి అతినీలలోహిత కిరణాల నుంచి మీ కళ్లను రక్షించడానికి సహాయపడతాయి.

55

6. మీ చర్మాన్ని హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంచడానికి నీటిని పుష్కలంగా తాగండి. బాగా హైడ్రేటెడ్ గా ఉండే చర్మం దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved