పచ్చ కామెర్లను తొందరగా తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు ఇవి
కామెర్లు తేలిగ్గా తీసుకునేంత చిన్న సమస్యేం కాదు. కామెర్ల సమస్య ఎక్కువగా అయితే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాలి. అవేంటంటే?
ప్రస్తుత జీవనశైలి యువతలో కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యలను పెంచే మరో సమస్య కామెర్లు. రక్తంలో బిలిరుబిన్ పేరుకుపోవడం వల్ల పచ్చ కామెర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం ద్వారా బిలిరుబిన్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా జీర్ణ ప్రక్రియ ద్వారా బిలిరుబిన్ శరీరం నుంచి బయటకు పోతుంది. కానీ రక్తంలో బిలిరుబిన్ పెరిగినప్పుడు కామెర్లు వస్తాయి.
కామెర్లు వచ్చినప్పుడు.. మూత్రం, కళ్ళు, గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. అలాగే శరీరం చాలా బలహీనంగా మారుతుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కామెర్లు వచ్చినప్పుడు ఉడకబెట్టిన ఆహారాన్ని మాత్రమే తినాలి. మరి కామెర్లు తొందరగా తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మీకు కామెర్లు వచ్చినట్టు తెలిసిన వెంటనే మీరు తినడం, తాగడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏది పడితే అది తినకూడదు. తాగకూడదు. కామెర్లు వచ్చిన వాళ్లు ఆయిల్, నెయ్యి, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మాంసాన్ని మొత్తమే తినకూడదు.
ముఖ్యంగా హానికరమైన పదార్థాలు మీ కాలేయంలో పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇందుకోసం మీరు నీళ్లను ఎక్కువగా తాగాలి. ఎందుకంటే శరీరం నుంచి కాలేయంలో పేరుకుపోయే మలినాలన్నీ నీటి వనరు. మీరు నీటిని ఎక్కువగా తాగితే అవి బయటకు పోతాయి.
green tea
అలాగే రోజుకు 3 కప్పుల గ్రీన్ టీ తాగాలని నిపుణులు చెబుతున్నారు. కావాలనుకుంటే మీరు గ్రీన్ టీకి బదులుగా హెర్బల్ టీని కూడా తాగొచ్చు. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.
అలాగే కామెర్లు వచ్చిన వారికి బొప్పాయి ఆకుల రసం కూడా ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. బొప్పాయి ఆకులో పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కామెర్లను తగ్గించడానికి సహాయపడుతుంది. కావాలనుంటే మీరు బొప్పాయి ఆకు రసంలో రుచి కోసం కొంచెం తేనెను కలుపుకుని తాగొచ్చు.
కామెర్లు త్వరగా నయం చేయడంలో ఉసిరి కాయ కూడా బాగా సహాయపడుతుంది. ఇది బిలిరుబిన్ స్థాయిలను నార్మల్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే ఉసిరికాయలను తినొచ్చు. లేదా జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు.