మీ ముఖంపై ఇలా మారిందా? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్టే..!
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ముఖంపై మొటిమలు, దద్దుర్లు వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ వ్యాధికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలేనంటున్నారు నిపుణులు.

fatty liver
బలహీనంగా అనిపించడం, కళ్లు పసుపు రంగులోకి మారడం, ముఖంపై మొటిమలు చికాకు కలిగించడం ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు. ఎన్సీబీఐ ప్రకారం.. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది దీని బారిన పడుతున్నారు. స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగా ఇది వేగంగా వ్యాప్తిచెందుతోంది. కొవ్వు కాలేయంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్.
fatty liver
ఫ్యాటీ లివర్ అంటే ఏంటి?
ఫ్యాటీ లివర్ అంటే కాలేయంపై కొవ్వు ఎక్కువగాపేరుకుపోవడం ప్రారంభమయ్యే పరిస్థితి. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల కాలెయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎన్సీబీఐ ప్రకారం.. కాలేయ బరువు కంటే శరీర కొవ్వు 10 శాతం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల కాలేయం సరిగ్గా పనిచేయదు. దీనికి ప్రధాన కారణం తప్పుడు ఆహారపు అలవాట్లేనంటున్నారు నిపుణులు.
fatty liver
ఫ్యాటీ లివర్ కు కారణాలు
తప్పుడు ఆహారపు అలవాట్లు
శరీర బరువు పెరగడం
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం
fatty liver
ఫ్యాటీ లివర్ లక్షణాలు
నోట్లో బొబ్బలు
ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా మీ శరీరం జింక్ వంటి పోషకాలను సులభంగా గ్రహించలేకపోతుంది. దీంతో మీ శరీరంలో జింక్ లోపిస్తుంది. దీనివల్ల మీ నోటి చుట్టూ బొబ్బలు అవుతాయి. ఇవి చర్మశోథ వాపునకు కారణమవుతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం.. చర్మశోథ సమస్య జింక్ లోపం వల్ల వస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది. ఇది చర్మంపై చికాకును, దురదను కలిగిస్తుంది.
మొటిమలు
కౌమారదశలో హార్మోన్ల మార్పుల వల్ల ముఖంపై మొటిమలు కావడం సర్వసాధారణం. అంతేకాదు ఒక్కోసారి ఫ్యాటీ లివర్ కూడా ఈ సమస్యకు కారణం కావొచ్చు. ఎన్హెచ్ఎస్ ప్రకారం.. మొటిమలలో దురద, నొప్పి లేదా ఎరుపు ఉంటే అది మీ కాలేయం ఆరోగ్యం సరిగ్గా లేదని అర్థం. కాలేయం విష పదార్ధాలతో నిండినప్పుడు ఇలా చర్మం పై చికాకు కలుగుతుంది.
కామెర్ల లక్షణాలు
ఈ వ్యాధి ఉంటే మీ చర్మం తెల్లగా మారి.. మీ కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. వాస్తవానికి శరీరంలో బిలిరుబిన్ అనే పసుపు పదార్థం ఏర్పడటం వల్ల కామెర్లు వస్తాయి. ఇది మీకు కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది.
ముఖంపై వాపు
ఫ్యాటీ లివర్ వల్ల శరీరంలో ప్రోటీన్ తయారు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది మీ రక్త ప్రవాహం, ద్రవం తొలగింపు వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మీ ముఖం వాపు వస్తుంది.
దురద
శరీరంలో పిత్త లవణాలు పెరగడం వల్ల ముఖంతో సహా శరీరంలోని ఇతర భాగాలలో దురదగా అనిపిస్తుంది. అలాగే చికాకు కూడా కలుగుతుంది.