MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • లిప్ స్టిక్ వాడే అలవాటుందా? అయితే మీరు ఈ రోగాలను కొనితెచ్చుకున్నట్టే..!

లిప్ స్టిక్ వాడే అలవాటుందా? అయితే మీరు ఈ రోగాలను కొనితెచ్చుకున్నట్టే..!

లిప్ స్టిక్ వాడితే అందంగా కనిపిస్తారు. ఇది అందరికీ తెలుసు. తెలియని విషయం ఏంటంటే.. దీనిలో ఎన్నో రకాల కెమికల్స్ ను వాడుతారు. ఇది మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. 
 

R Shivallela | Published : Sep 24 2023, 03:37 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
lipstick

lipstick

అమ్మాయిలు అందంగా కనిపించాలని ఎంతో ఆశపడుతుంటారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్ లో దొరికే ఎన్నో వస్తువులను వాడేస్తుంటారు. అసలు ఆ బ్యూటీ ప్రొడక్స్ట్ ఆరోగ్యానికి మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అని తెలుసుకోకుండా.. అందంగా కనిపించాలనే ఒక్క ఉద్దేశ్యంతోనే వాడుతుంటారు. ఇలాంటి వాటిలో లిప్ స్టిక్ ఒకటి. లిప్ స్టిక్ పెదాలను అందంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది అందరికీ తెలుసు. అందుకే ప్రస్తుత కాలంలో చాలా మంది వీటిని వాడుతున్నారు. కానీ లిప్ స్టిక్ మీ  ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అవును దీని వాడకం వల్ల మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

26
Asianet Image

మహిళలు సెక్సీగా, అందంగా కనిపించడానికి ఉపయోగించే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో లిప్ స్టిక్ ఒకటి. నేషనల్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. లిప్ స్టిక్ తయారీలో సీసం, మాంగనీస్, కాడ్మియం వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు ఉన్న లిప్ స్టిక్ ను వాడటం వల్ల శరీరంలో అలర్జీల సమస్య వస్తుంది.
 

36
Asianet Image

మరో అధ్యయనం ప్రకారం.. పెదవులకు ఉపయోగించే సౌందర్య సాధనాల్లో ఎన్నో రకాల రసాయనాలు వాడుతారు. ఈ కెమికల్స్ ఉన్న లిప్ స్టిక్ ను పెదాలకు పెట్టడం వల్ల.. అది నోటి నుంచి నేరుగా కడుపులోకి వెళుతుంది. దీనివల్ల మీకు ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. 

46
Asianet Image

ఇకపోతే లిప్ స్టిక్ తయారీలో ఉపయోగించే సీసం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా ఇది గర్భిణులకు ఎంతో ప్రమాదకరం. ఇది గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాదు వారి కడుపులో పెరుగుతునన బిడ్డఆరోగ్యానికి కూడా మంచిది కాదు. లిప్ స్టిక్ లోని సీసం పెదవుల ద్వారా కడుపులోకి వెళ్లి రక్తంలో సీసం స్థాయి పెరుగుతుంది.
 

56
Asianet Image


మీకు తెలుసా? లిప్ స్టిక్ లోని రసాయనాలు మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాదు లిప్ స్టిక్ తయారీలో వాడే పెట్రోకెమికల్స్ పునరుత్పత్తి వ్యవస్థ, తెలివితేటలు, శరీర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

66
Asianet Image

అందుకే లిప్ స్టిక్ ను వాడే అలవాటును తగ్గించండి. అలాగే మీ పెదాలకు లిప్ స్టిక్ ను నేరుగా అప్లై చేయకుండా ముందు కొద్దిగా కొబ్బరినూనెను పెదవులకు అప్లై చేయండి. ఆ తర్వాతే పెదాలకు లిఫ్టిక్ ను పెట్టండి. ఈ కొబ్బరి నూనె మీ పెదాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

R Shivallela
About the Author
R Shivallela
సౌందర్యం
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories