థైరాయిడ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఈ రోజుల్లో థైరాయిడ్ ఒక కామన్ సమస్యగా మారిపోయింది. అందుకే చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటున్నారు. కానీ దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

ప్రస్తుత కాలంలో డయాబెటీస్, థైరాయిడ్ సమస్యలు సర్వ సాధారణం అయిపోయాయి. పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే థైరాయిడ్ వచ్చేలా చేస్తున్నాయి. కానీ ఈ థైరాయిడ్ సమస్య లైట్ తీసుకోవాల్సిన చిన్న అనారోగ్య సమస్య అయితే కాదు.
థైరాయిడ్ మన మెడ దిగువ భాగంలో ఉన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న గ్రంథి. ఇది మన శరీరంలో ఎన్నో కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లను థైరాయిడ్ హార్మోన్లు అంటారు. అయితే ఈ గ్రంథి తక్కువ లేదా ఎక్కువ హార్మోన్లను విడుదల చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
thyroid
కానీ ఈ థైరాయిడ్ వల్ల బరువు పెరగడం, చర్మం పొడిబారడం, విపరీతమైన అలసట, చలిని తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, నిరాశ వంటి సమస్యలు వస్తాయని చెప్తారు. కానీ ఈ థైరాయిడ్ మన కళ్లపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అసలు థైరాయిడ్ మన కళ్లపై ఎలాంటి ప్రభావాన్నిచూపుతుందంటే?
థైరాయిడ్ కంటి వ్యాధి
థైరాయిడ్ వల్ల వచ్చే కంటి సమస్యను థైరాయిడ్ ఐ డిసీజ్ అంటారు. ఇదొక ఆటో ఇమ్యూన్ జబ్బు. దీనివల్ల మన రోగనిరోధక వ్యవస్థ మన కళ్ల వెనుకున్న కణజాలాలపై దాడి చేస్తుంది. దీంతో మన కళ్లలో వాపుతో పాటుగా ఎన్నో కంటి సమస్యలు వస్తాయి. అసలు థైరాయిడ్ వల్ల ఎలాంటి కళ్ల సమస్యలు వస్తాయంటే?
పొడి కళ్లు: థైరాయిడ్ వల్ల కొన్ని కొన్ని సార్లు కళ్లు బాగా పొడి బారతాయి. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ థైరాయిడ్ హార్మోన్లు మన కన్నీళ్ల ఉత్పత్తికి కారణమయ్యే లాక్రిమల్ గ్రంథుల పనితీరు ప్రభావితం అవుతుంది. దీంతో కళ్లలో దురద పెడుతుంది. చిరాకు కలుగుతుంది. పొడిబారతాయి. అయితే చాలా మంది ఈ సమస్యను లైట్ తీసుకుంటారు. కానీ దీన్ని అలాగే వదిలేస్తే మాత్రం కంటి సమస్యలు ఎక్కువ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాంతికి సున్నితత్వం
థైరాయిడ్ వల్ల కళ్లు పొడిబారడమే కాకుండా.. కాంతి సున్నితత్వం కూడా కలుగుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ లైట్ వెలుతురును చూడలేరు. దీనివల్ల మీరు రోజువారి పనులను చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కళ్లు బయటకు వస్తాయి
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. థైరాయిడ్ సమస్య వల్ల కళ్లు బాగా ఉబ్బుతాయి. థైరాయిడ్ కంటి వ్యాధి వల్ల మన కళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోతుంది. దీంతో కళ్లు ఉబ్బి ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తాయి. దీన్నే ఎక్సోఫ్తాల్మోస్ అని కూడా అంటారు.
డబుల్ విజన్
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. థైరాయిడ్ కంటి వ్యాధి వల్ల విపరీతమైన మంట కలుగుతుంది. దీనివల్ల కొంతమందికి స్టేబుల్ గా ఉండలేవు. అంటే దీనివల్ల డబుల్ విజన్ సమస్య వస్తుంది. దీనివల్ల వ్యక్తిగత పనులను చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.