పెరుగులో ఉల్లిపాయ కలుపుకుని తింటే ఏమౌతుందో తెలుసా?
ఆయుర్వేదం ప్రకారం.. ఉల్లిపాయ, పెరుగు రెండింటిలో వేర్వేరు లక్షణాలు ఉంటాయి. అంటే ఈ రెండింటిని కలిపి తింటే మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఆయుర్వేదంలో.. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఫుడ్ కు సంబంధించిన ఎన్నో నియమాలు ఉన్నాయి తెలుసా? వీటిని పాటించకపోతే మీరు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇలాంటి రూల్ లో పెరుగు, ఉల్లిపాయలు ఉన్నాయి.
Buttermilk
మనలో చాలా మంది పెరుగు, ఉల్లిపాయ కాంబినేషన్ ను చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఉల్లి.. పెరుగును కలిపి అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం.. ఉల్లిపాయ, పెరుగు రెండూ విభిన్న ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఉల్లిపాయ వేడిచేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అదే పెరుగు చలువ చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి పెరుగులో ఉన్న కాల్షియం వంటి పోషకాలను మన శరీరం గ్రహించడానికి ఆటంకం కలిగిస్తాయి. అసలు పెరుగును, ఉల్లిపాయను కలిపి తింటే వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గ్యాస్ట్రిక్ సమస్యలు
ఉల్లిపాయల్లో ఉండే సమ్మేళనాలు మనకు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చేలా చేస్తాయి. ఇకపోతే పెరుగులో ఉండే సమ్మేళనాలు కూడా ఇంచుమించు ఇదే ప్రభావాన్నిచూపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ రెండింటినీ కలిపి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ తో పాటుగా అజీర్ణ సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
శరీరం సహజ ఉష్ణోగ్రత పెరుగుతుంది
పెరుగులో చలువ చేసే లక్షణాలు ఉంటాయి. ఇకపోతే ఉల్లి సల్ఫర్ కంటెంట్ వల్ల వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. మీరు పెరుగును, ఉల్లిపాయను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది టాక్సిన్స్ లెవెల్ ను పెంచుతుంది. దీంతో మీ చర్మంపై దద్దుర్లు, తామర, సోరియాసిస్ తో పాటగుా ఇతర చర్మ అలెర్జీలు వస్తాయి.
జీర్ణ సమస్యలు
పెరుగును, ఉల్లిపాయను కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు పక్కాగా వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
చర్మ అలెర్జీలు
పెరుగులో ఉల్లిపాయలను కలిపి తింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మీ శరీరంలో అదనపు వేడిని ఉత్పత్తి అవుతుంది. ఇది మీ శరీరంలో టాక్సిన్స్ స్థాయిని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది తామర, దద్దుర్లతో పాటుగా కొన్ని కొన్ని సార్లు సోరియాసిస్ వంటి చర్మ అలెర్జీలకు కూడా దారితీస్తుంది. దీని పర్యావసానం ఎక్కువగా ఉంటే ఫుడ్ పాయిజనింగ్ బారిన కూడా పడొచ్చు.
curd
పెరుగు, ఉల్లిపాయను ఎలా కలపాలి?
ఉల్లిపాయలను వేయిస్తే వాటిలోని సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి మీరు ఉల్లిపాయల్ని వేయించి పెరుగులో కలిపి తినొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి అనారోగ్యసమస్యలు రావు. అంతేకాకుండా పెరుగు, ఉల్లిపాయ తినాలనే మీ కోరిక కూడా నెరవేరుతుంది.