నెయ్యి వీళ్లకు మంచిది కాదు.. అస్సలు తినొద్దు
నిజానికి నెయ్యిలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా అందాన్ని కూడా పెంచుతాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు నెయ్యిని ఎట్టి పరిస్థితిలో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వాళ్లు ఎవరంటే?
నెయ్యిని మనం ఎన్నో విధాలుగా ఉపయోస్తాం. పప్పు, కూరగాయల్లో నెయ్యిని చేర్చడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. అలాగే మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతాం. నిజానికి నెయ్యిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా దీనిలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ వంటి ఎన్నో రకాల పోషకాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు నెయ్యిలో ఉండే బ్యూటిరిక్ ఆమ్లం శరీరం వ్యాధి-పోరాట టి-కణాలను ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది.
నెయ్యి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా.. ఇది అందరికీ మంచిది కాకపోవచ్చు. అవును కొంతమంది నెయ్యిని తినకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నెయ్యిని ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ghee
ఎవరు నెయ్యి ఎక్కువగా తినొద్దు
జీర్ణ సమస్యలు
జీర్ణ సమస్యలతో బాధపడున్నవారికి నెయ్యి మంచిది కాదు. అందుకే మీకు ఇప్పటికే గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉంటు మాత్రం నెయ్యిని ఎక్కువగా తినకండి. ఎందుకంటే నెయ్యిని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.
గుండె సంబంధ సమస్యలు
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే మీరు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే 10 మి.గ్రా కంటే ఎక్కువ నెయ్యిని తీసుకోకండి.
fake ghee oil
బరువు పెరిగే సమస్య
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టైతే నెయ్యిని తినకండి. ఒకవేళ తిన్నా ఎక్కువగా మాత్రం తీసుకోకండి. ఎందుకంటే నెయ్యిని ఎక్కువగా తింటే మీరు బరువు పెరిగిపోతారు. ఎందుకంటే నెయ్యిలో కంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు బరువు మరింత పెరగడానికి కారణమవుతుంది. అలాగే నెయ్యిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే నెయ్యిని ఎక్కువగా తింటే ఊబకాయం బారిన పడతారని నిపుణులు చెప్తారు.
కఫం సమస్యను పెంచుతుంది
దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు నెయ్యిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే జలుబు చేసినప్పుడు కఫం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు నెయ్యిని తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది.
ghee
పాలకు అలెర్జీ
కొంతమందికి పాలకు అలెర్జీ కూడా ఉంటుంది. ఇలాంటి వారు కూడా నెయ్యిని అస్సలు తినకూడదు. ఎందుకంటే పాలు, నెయ్యి రెండూ పాల ఉత్పత్తులే. అందుకే మీకు పాలకు అలెర్జీ ఉంటే గనుక నెయ్యిని తినకండి. ఒక్క నెయ్యినే కాదు దాని నుంచి తయారైన అన్ని రకాల ఆహారాలను తినడం మానేయాలి.ఇలాంటి వారు నెయ్యిని తింటే చర్మంపై దద్దుర్లు, ఎరుపు, వాంతులు, కడుపులో గ్యాస్, తిమ్మిరి, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.