- Home
- Life
- Health
- Kitchen tips: ఎర్ర ఉల్లిపాయ, తెల్ల ఉల్లిపాయల్లో ఏది మంచిది? ఏ కూరలో ఏ ఉల్లిపాయ వేసుకోవచ్చు?
Kitchen tips: ఎర్ర ఉల్లిపాయ, తెల్ల ఉల్లిపాయల్లో ఏది మంచిది? ఏ కూరలో ఏ ఉల్లిపాయ వేసుకోవచ్చు?
వంటింట్లో కచ్చితంగా ఉండాల్సిన వాటిలో ఉల్లిపాయ ఒకటి. ఇవి లేకుండా ఏ వంటలు చేయలేము. కూరకైనా, చట్నీకి అయినా మంచి రుచి రావాలంటే ఉల్లిపాయ తప్పనిసరి. ఉల్లి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కానీ ఏ ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా?

వంటగదిలో ఉల్లిపాయలకు ప్రత్యేక స్థానం ఉంది. ఉల్లిపాయ వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉల్లిపాయలో రెండు రకాలు ఉన్నాయి. అవి ఎర్ర ఉల్లిపాయ, తెల్ల ఉల్లిపాయ. సాధారణంగా అందరూ ఈ రెండు రకాల ఉల్లిపాయలను వంటల్లో వాడుతుంటారు. కానీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
అన్ని వంటల్లో..
ఉల్లిపాయ లేకుండా వంట పూర్తి కాదు. కొందరైతే ఉల్లిపాయ లేకుండా వంట చేయడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే ఉల్లిపాయల ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఎర్ర లేదా తెల్ల ఉల్లిపాయల్లో తేడాలు ఉన్నప్పటికీ, అన్ని రకాల వంటలను తయారు చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు.
ఎర్ర, తెల్ల ఉల్లిపాయల మధ్య తేడాలు
- ఎర్ర ఉల్లిపాయ ముదురు ఎరుపు నుంచి ఊదా రంగులో ఉంటుంది. లోపల తెలుపు రంగులో ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటుంది. తెల్ల ఉల్లిపాయ పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది.
- ఎర్ర ఉల్లిపాయను వంటల్లోనే కాకుండా పచ్చిగా కూడా తినవచ్చు. తెల్ల ఉల్లిపాయను ఎక్కువగా వెస్ట్రన్ వంటకాల్లో, ముఖ్యంగా సూప్‌లలో ఉపయోగిస్తారు.
- ఎర్ర ఉల్లిపాయ కొంచెం కారంగా ఉంటుంది. దీని రుచి మొత్తం ఆహారం రుచిని పెంచుతుంది. తెల్ల ఉల్లిపాయ తీపిగా ఉంటుంది. అందుకే దీన్ని సూప్‌లు, శాండ్‌విచ్‌లు వంటి వాటిలో ఉపయోగిస్తారు.
- ఎర్ర ఉల్లిపాయలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. తెల్ల ఉల్లిపాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
తెల్ల ఉల్లిపాయ ప్రయోజనాలు
తెల్ల ఉల్లిపాయలో ఉండే ఫైబర్ కడుపుకు చాలా మంచిది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ ఉల్లిపాయ ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
ఎర్ర ఉల్లిపాయ ప్రయోజనాలు:
ఎర్ర ఉల్లిపాయ వంట రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది గుండెను రక్షించడానికి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది.