మీ మూత్రం వాసన వస్తోందా? ఇందుకే కావొచ్చు జాగ్రత్తగా ఉండండి
కొన్ని రకాల ఆహారాలు, మందుల ప్రభావం వల్ల మూత్రం వాసన రంగులో మార్పు రావడమే కాదు మూత్రం వాసన కూడా వస్తుంది. అయినప్పటికీ.. కొన్ని వ్యాధులు లేదా అనారోగ్య సమస్యలకు సంకేతంగా కూడా మూత్రం రంగు, వాసనలో తేడాలు వస్తాయంటున్నారు నిపుణులు.
urine
సాధారణంగా మన మూత్రం ఎలాంటి రంగులో ఉండదు. ఇది మీరు ఆరోగ్యంగా ఉన్నారని సూచిస్తుంది. అలాగే మూత్రం ఘాటైన వాసన కూడా ఉండదు. అయితే కొంతమంది మూత్రం మాత్రం ఘాటైన చెడు వాసన వస్తుంది. రంగులో కూడా మార్పులు వస్తాయి. అయితే మనం తినే ఆహారాలు కూడా మాత్రం భరించలేని వాసన వచ్చేలా చేస్తాయి. ఒక్క మూత్రం వాసనే కాదు చెమట వాసన కూడా ఇలాగే ప్రభావితం అవుతుందని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల మందులు కూడా మూత్రం వాసన వచ్చేలా చేస్తాయంటున్నారు నిపుణులు.
urine
తినే ఆహారం, మందుల ప్రభావం వల్ల మూత్రం వాసనలో మార్పు వస్తుంది. అయితే ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది. అయినప్పటిక కొన్ని వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతంగా కూడా మూత్రం రంగు, వాసనలో తేడాలు వస్తాయి. ఇలాంటి సమస్యలు మీకొస్తే మాత్రం కొన్నిన జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాల్సిందేనంటున్నారు నిపుణులు.
ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆహార పదార్థాలు లేదా మందుల ప్రభావం వల్ల మూత్రం వాసన ఎక్కువ కాలం రాదు. అందుకే మీ మూత్రం చెడు వాసన వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడమే మంచిది.
urine
మూత్రం వాసనొచ్చేలా చేసే ఆహారాలు
కొన్ని ఆహారాలు లేదా వంటకాలు మూత్రం చెడు వాసన వచ్చేలా చేస్తాయి. కాఫీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, వివిధ రకాల మసాలా దినుసులను తినడం వల్ల మూత్రం చెడు వాసన వస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల మూత్రం వాసనేంరాదు. అయితే రోజుకు నాలుగైదు సార్లు కాఫీని తాగితే మాత్రం మీ మూత్రం ఖచ్చితంగా వాసన వస్తుంది. కాఫీలోని కొన్ని పదార్థాలే దీనికి కారణమవుతాయి. అంతేకాక ఎక్కువ కాఫీ మూత్రం మొత్తాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల మీరు నిర్జలీకరణానికి గురవుతారు.
urine color
ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా మూత్రంలో వాసనను కలిగిస్తాయి. వీటిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మీ మూత్రం కుళ్లిపోయిన గుడ్డు, క్యాబేజీ లాంటి వాసన వస్తుంది. జీలకర్ర, కొత్తిమీర, గరం మసాలా వంటి మసాలా దినుసులన్నీ మీ మూత్రం వాసన వచ్చేలా చేస్తాయి. కానీ ఇది తాత్కాలికం మాత్రమే.
రోగాలు
అనారోగ్యం లేదా కొన్ని రోగాల వల్ల కూడా కొంతమందికి మూత్రం దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి మీరు ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలి. మూత్రం ఘాటైన వాసనతో పాటుగా నొప్పి, మంట, మూత్రం రంగులో మార్పు, మూత్ర విసర్జన చేసేటప్పుడు చికాకుగా కనిపిస్తే మాత్రం మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడినట్టే. అలాగే మూత్రంలో వాసన రావడం కూడా టైప్ -2 డయాబెటిస్, మూత్రపిండాల్లో రాళ్లకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.