ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!
తొందరగా పడుకొని తొందరగా నిద్రలేవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. దీనివల్ల మీరు రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు. అలాగే ఎన్నో రోగాల ముప్పు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల బోలెడు లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
ఎక్కువ సమయం
త్వరగా నిద్రలేవడం వల్ల ఇంటి పనులను తర్వగా కంప్లీట్ చేసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడే తగినంత సమయం దొరుకుతుంది. ఈ సమయంలో లభించే ప్రశాంతమైన సమయం మీరు పనులకు సిద్దం కావడానికి సహాయపడుతుంది.
ప్రశాంతమైన నిద్ర
మీరు త్వరగా నిద్రలేవడం వల్ల మీరు సాయంత్రంకల్లా అలసిపోయినట్టుగా ఉంటారు. దీనివల్ల మీరు రాత్రిపూట తొందరగా నిద్రలోకి జారుకుంటారు. అలాగే ప్రశాంతంగా నిద్రపోతారు. ఇది మీరు బాగా విశ్రాంతి తీసుకోవడానికి, సిర్కాడియన్ రిథమ్ ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యం
త్వరగా నిద్రలేవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఈ సమయంలో వాతావారణం పీస్ ఫుల్ గా ఉంటుంది. అలాగే మీరు చేయాల్సిన పనుల గురించి ఆలోచించడానికి కూడా మీకు తగిన సమయం దొరుకుతుంది. ఇది కార్టిసాల్ స్థాయిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
అదనపు సమయం, మెరుగైన ప్రణాళిక
మీరు ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీరు రోజులో చేయాల్సిన పనుల గురించి సరైన ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు పనులను చేయడానికి తొందరపడాల్సిన అవసరం ఉండదు.
ఎనర్జీ
మీరు త్వరగా పడుకోని త్వరగా నిద్రలేవడం వల్ల మీరు కంటినిండా నిద్రపోతారు. దీనివల్ల మీరు మరుసటి రోజు మరింత విశ్రాంతి తీసుకుంటారు. అలాగే రిఫ్రెష్ గా ఉంటారు. ఎనర్జిటిక్ ఉంటారు.
morning walk benefits
వ్యాయామ సమయం
ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల మీరు వ్యాయామం చేయడానికి కావాల్సిన సమయం దొరుకుతుంది. వ్యాయామం చేయాలంటే మీరు ఖచ్చితంగా త్వరగా నిద్రలేవాలి. మంచి విశ్రాంతితో, ఎక్కువ శక్తితో మీరు వ్యాయామం చేయడానికి ప్రయత్నించొచ్చు. ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల మీరు మార్నింగ్ వాకింగ్ కు వెళ్లొచ్చు. లేదా యోగా చేయొచ్చు. కానీ ఇలా పొద్దున్న లేస్తే ఏదో ఒక శారీరక శ్రమలో పాల్గొనొచ్చు.
హృదయపూర్వక అల్పాహారం
బిజీ షెడ్యూల్ లో సమయం లేకపోవడం వల్ల చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. అయితే త్వరగా నిద్రలేవడం వల్ల మీరు బ్రేక్ ఫాస్ట్ ను తినే మంచి సమయం దొరుకుతుంది. ఫలితంగా మీ ఆరోగ్యం బాగుంటుంది.
మెరిసే చర్మం
నిద్రలో మీ చర్మ కణాలు పునరుత్పత్తి, మరమ్మత్తు చేయబడతాయి. త్వరగా నిద్రలేవడం మంచి చర్మ సంరక్షణ దినచర్యను నిర్వహించడానికి కూడా మీకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.