MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • రాయలసీమ స్పెషల్.. మెంతులతో పప్పు ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది!

రాయలసీమ స్పెషల్.. మెంతులతో పప్పు ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది!

మెంతులలో (Fenugreek) అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులను వంటలలో ఉపయోగిస్తే వంటలకు మంచి రుచిని అందించడంతోపాటు మంచి సువాసన కూడా అందిస్తాయి. మెంతులతో చేసుకునే పప్పు చాలా రుచిగా ఉంటుంది. తింటుంటే ఇంకాస్త తినాలనిపిస్తుంది. ఈ పప్పును ఎంతో సులభంగా తక్కువ సమయంలో వండుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం రాయలసీమ స్పెషల్ మెంతి పప్పు (Menthi pappu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Jul 07 2022, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కావలసిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు (Red gram), ఒక స్పూన్ మెంతులు (Fenugreek), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), నాలుగు టమోటాలు (Tomatoes), పది ఎండు మిరపకాయలు (Dry chillies), కొద్దిగా చింతపండు (Tamarind), పావు స్పూన్ పసుపు (Turmeric), రుచికి సరిపడా ఉప్పు (Salt).
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

పది వెల్లుల్లి (Garlic) రెబ్బలు,  కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, సగం స్పూన్ ఆవాలు (Mustard), సగం స్పూన్ జీలకర్ర (Cumin), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), రెండు కరివేపాకు (Curries) రెబ్బలు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

36

తయారీ విధానం: కుక్కర్ తీసుకొని అందులో  కడిగిన కందిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఉల్లిపాయ తరుగు, ఎండు మిరపకాయలు, టమోటా ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తరుగు, కొద్దిగా నూనె (Oil), మూడు గ్లాసుల నీళ్లు (Water) పోసుకోవాలి.
 

46

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వెడెక్కిన తరువాత మెంతులను వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.ఇప్పుడు ఈ మెంతులను కుక్కర్ లో వేసి కుక్కర్ మూత పెట్టి ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ఆవిరి (Steam) పోయాక మూత తీసి పప్పు గిత్తతో పప్పును మెదుపుకోవాలి.
 

56

ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడేక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి. తరువాత కరివేపాకు రెబ్బలు, ఎండు మిరపకాయలను వేసి ఫ్రై చేసుకుని పప్పుకు పోపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే మెంతి పప్పు రెడీ.
 

66

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మెంతులతో పప్పును ట్రై చేయండి. ఈ పప్పు చాలా రుచిగా ఉండడంతో మీ పిల్లలు మళ్లీమళ్లీ అడిగి చేయించుకుని తినడానికి ఇష్టపడతారు. మెంతులలో ఉండే పోషకాలు (Nutrients) ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి జుట్టుకు అనేక ప్రయోజనాలను (Benefits) అందిస్తాయి. కనుక వంటలలో మెంతులను ఏదో విధంగా ఉపయోగిస్తే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved