సోరియాసిస్ ఉంటే గుండె జబ్బులొస్తయా?
ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. సోరియాసిస్ ఉన్న రోగులకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీళ్లు గుండె ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.
Psoriasis
సోరియాసిస్ ఒక దీర్ఘకాలిక చర్మ సమస్య. ఈ వ్యాధి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఎరుపు, పొలుసుల మచ్చలు కనిపిస్తాయి. ఇది దీర్ఘకాలిక సమస్య. అంటే ఇది సంవత్సరాల కాలం లేదా జీవితాంతం ఉంటుంది. అయితే ఈ సోరియాసిస్ సమస్యకు ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ ఇది అతి చురుకైన రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినదని నమ్ముతారు. జెనెటిక్స్ కూడా ఇందుకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే సంక్రమణ, ఒత్తిడి వంటి కొన్ని పర్యావరణ కారకాల వల్ల కూడా ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. అయితే ఈ సోరియాసిస్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. చర్మం ఎర్రగా మారడం, పొలుసులు ఏర్పడుతాయి. కానీ ఇవి బాగా దురద పెడతాయి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. దీనికి మందులు, యూవీ లైట్ థెరపీ, నోటి లేదా ఇంజెక్షన్ మందులను ఉపయోగిస్తారు. అయితే ఈ సోరియాసిస్ అంటువ్యాధి కాదు. కానీ దీన్ని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. కానీ సరైన చికిత్స, జీవనశైలి మార్పులతో దీనిని నియంత్రించొచ్చు.
PSORIASIS
జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీలో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం.. సోరియాసిస్ వ్యాధి ఉన్న రోగులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ ప్రమాదం ఉందని కనుగొన్నారు. సోరియాసిస్ ప్రపంచ జనాభాలో 1-3 శాతం మందిని ప్రభావితం చేస్తుందని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు.
ఇటలీలోని పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.. క్లినికల్ హృదయ సంబంధ వ్యాధులు లేని 503 మంది సోరియాసిస్ రోగులపై ఒక అధ్యయనం నిర్వహించారు. వారు కొరోనరీ మైక్రో సర్క్యులేషన్ ను అంచనా వేయడానికి ట్రాన్స్థొరాసిక్ డాప్లర్ ఎకోకార్డియోగ్రఫీ చేయించుకున్నారు. లక్షణాలు లేని రోగులలో 30 శాతానికి పైగా కొరోనరీ మైక్రోవాస్కులర్ పనిచేయకపోవడాన్ని గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని వారు కనుగొన్నారు.
"తీవ్రమైన సోరియాసిస్ ఉన్న రోగులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం, మరణాలు పెరుగుతున్నాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చూపించాయి. ఏదేమైనా పెరిగిన ప్రమాదానికి కారణమయ్యే నిర్దిష్ట విధానాలపై తక్కువ సంఖ్యలోనే పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా కొరోనరీ మైక్రోవాస్కులర్ పనిచేయకపోవడానికి సంబంధించి" అని అధ్యయనం ప్రధాన పరిశోధకుడు స్టెఫానో పియాసెరికో, డెర్మటాలజీ యూనిట్, మెడిసిన్ విభాగం చెప్పారు.
"సోరియాసిస్ ఉన్న రోగులలో మైక్రోవాస్కులర్ పనిచేయకపోవడాన్ని మేము నిర్ధారించాలి. అలాగే మరింత చురుకుగా శోధించాలి. ఎందుకంటే ఈ జనాభా ముఖ్యంగా ఎక్కువ ప్రమాదంలో ఉంది" అని పియాసెరికో చెప్పారు.