ప్యాకెట్ పాలు, ఫ్రెష్ పాలు.. రెండింటిలో ఏవి మంచివంటే?
పాలు మన ఎముకలను బలంగా ఉంచుతాయి. పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. అంతేకాదు పాలతో మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అందుకే ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాలను తాగుతున్నారు. అయితే సిటీల్లో ఉండేవారికి ఫ్రెష్ పాలు దొరకవు. అందుకే ప్యాకెట్ పాలను తాగుతుంటారు. అసలు ప్యాకెట్ పాలను తాగితే మంచిదేనా? అని ఎప్పుడైనా ఆలోచించారా?
Milk
పాలు మంచి పోషకాహారం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న ముచ్చట అందరికీ తెలిసిందే. పాలలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి 2, విటమిన్ సి వంటి రకరకాల విటమిన్లు మెండుగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఎన్నో రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు పాలను తాగిస్తుంటారు. ఇకపోతే పెద్దవయసు వారు కూడా రాత్రి పూట ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తాగుతుంటారు.
Milk
అయితే కొంతమంది ఫ్రెష్ పాలను తాగితే.. మరికొంతమంది ప్యాకెట్ పాలను తాగుతుంటారు. ఈ ప్యాకెట్ పాలను ఎక్కువగా సిటీల్లో ఉండేవారే తాగుతారు. ఎందుకంటే అక్కడ ఫ్రెష్ పాలు దొరకవు. గ్రామాల్లో అయితే గేదెలను, ఆవులను పెంచుకుంటారు కాబట్టి.. ఇక్కడ ఫ్రెష్ పాలు దొరుకుతాయి. గ్రామాల్లో ప్యాకెట్ పాలను తాగే వారు చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఫ్రెష్ పాలు, ప్యాకెట్ పాలకు తేడా ఏంటి? ఈ రెండు పాలలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్యాకెట్ పాలు
ప్యాక్ చేసిన పాలు మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ పాలను ఎన్నో ప్రక్రియ ద్వారా తయారుచేస్తారు. ఈ పాలను నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ప్రాసెస్ చేస్తారు. అలాగే ఈ పాలు నేరుగా చాలా చల్లని ఉష్ణోగ్రతకు ప్యాక్ చేయబడుతుంది. ఇది దానిలో ఉన్న బ్యాక్టీరియాను మొత్తం తొలగిస్తుంది. మార్కెట్ లో ఈ పాలను మనం ఫుల్ క్రీమ్, టోన్డ్ లేదా డబుల్ టోన్డ్ మిల్క్ రూపంలో కొనొచ్చు. అయితే ఈ పాలు ముందుగా పాశ్చరైజ్ చేయబడుతాయి. అంటే కాచిన పాలన్న మాట. కాబట్టి మనం వీటిని తర్వాత బాగా మరిగించాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా వేడి చేసి తాగితే సరిపోతుంది.
milk
ఫ్రెష్ మిల్క్
తాజా పాలు స్థానిక డెయిరీలో ఫామ్ లల్లో దొరుకుతాయి. ఇక్కడ అప్పుడే పితికి పాలు దొరుతాయి. ఇందులో మెకానికల్ రోల్ ఉండదు. తాజా పాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఇది సాధారణంగా ప్యాకేజ్డ్ పాలు కంటే మంచిదని భావిస్తారు. దీన్ని ఆర్గానిక్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తే.. ఈ పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ రెండింటిలో ఏది బెటర్?
ఎదుగుతున్న పిల్లలకు పాలను ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఈ పాలను మీరు ఏ రూపంలో తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. స్థానిక డెయిరీలో దొరికే తాజా పాలను మెరుగ్గా భావించినా.. పశువులకు ఇచ్చే ఇంజెక్షన్, వాటి పశుగ్రాసంలో కల్తీ వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. డెయిరీ యజమానులు తమ ఖర్చులను ఆదా చేయడానికి జంతువులను బహిరంగంగా వదిలివేస్తారు. దీనివల్ల అవి చెత్తను తినే ప్రమాదం ఉంది. ఇలాంటి పాలలో పోషకాలు ఉండదు. అలాగే ఇవి తాగితే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ప్యాకేజ్డ్ మిల్క్ గురించి చెప్పాలంటే.. దానిని పాశ్చరైజ్ చేసి, సజాతీయీకరించడం ద్వారా తయారు చేస్తారు. దానిలో బాహ్య బ్యాక్టీరియా ప్రమాదం లేదు. కానీ కల్తీ ఈ రోజుల్లో ఎక్కువైంది. అందుకే సేంద్రీయ పాలు అంటే పాడి నుంచి పాలు అనే ఎంపిక వైపు వెళ్లడం మంచిది. ఈ పాలు మంచివా? కావా? అన్ని దాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.