Health Tips: అతిగా వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఈ ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నట్లే?
Health Tips: పది రోజుల్లో 10 కేజీలు వెయిట్ తగ్గిపోవాలి.. లేదా బాడీ షేప్ వారం రోజుల్లో వచ్చేయాలి అని అతిగా వ్యాయామం చేస్తే మీరు ప్రమాదంలో పడబోతున్నారని అర్థం. అతిగా వ్యాయామం చేయటం వలన వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం.
బరువు తగ్గాలనుకునే వారికి వ్యాయామం మాత్రమే సరియైన మార్గం. దానితోపాటు సరియైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చును. అయితే సరైన గైడెన్స్ లేకుండా వారం రోజుల్లో ఎన్ని కేజీలు తగ్గిపోవాలి, పది రోజుల్లో సిక్స్ ప్యాక్ రావాలి అని అతిగా వ్యాయామం చేస్తే అటు మానసికంగానూ ఇటు శారీరకంగానూ దెబ్బతింటారు.
అతిగా వ్యాయామం చేయటం వల్ల మీ పనితీరు తగ్గడమే కాకుండా మీరు అన్ని సమయాలలోని అలసిపోయేలాగా శరీరం మిస్సత్వగా అయిపోయింది రాత్రిపూట మీరు 7, 8 గంటలు నిద్రపోయినప్పటికీ ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకున్నప్పటికీ కూడా ఆ నీరసం ఎఫెక్ట్ మీ శరీరం మీద పడుతుంది.
చాలా తీవ్రమైన వ్యాయామం మీ శరీరం ఒత్తిడి హార్మోన్ ను విడుదల చేయమని బలవంతం చేస్తుంది. దీనివలన మీరు రోజంతా అలసిపోయినట్లుగా కనిపిస్తారు. అలాగే మీ గుండె ఒత్తిడికి లోనైనప్పుడు అది కొట్టుకునే రేటు పెరుగుతుంది.
ఇది విశ్రాంతి హృదయ స్పందన రేటు పెంచుతుంది. దీనివలన గుండెపోటు లేదా స్ట్రోక్ తో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే ఆడవాళ్ళలో అయితే ఎక్కువగా వ్యాయామం చేసిన వాళ్ళు పీరియడ్స్ ని మిస్ అవుతున్నట్లుగా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
దీనిని అమినోరియా అని పిలుస్తారు. ఇది బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. వ్యాయామం తరువాత మీ మూత్రం రంగు మారినట్లయితే కనుక అది రాబ్డోమియోలిసిస్ అనే పరిస్థితిని సూచిస్తుంది. అంటే దెబ్బతిన్న కండరాల కణజాలం నుంచి పదార్థాలు రక్తంలోకి లీక్ అవుతాయి.
ఇది క్రమేణా కిడ్నీ సమస్యలకి దారితీస్తుంది. మీ కండరాలకి సరియైన విశ్రాంతి ఇవ్వకుండా తీవ్ర వ్యాయామం చేసినప్పుడు అది మీ దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే నొప్పికి గురవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి.