స్వీట్లు మాత్రమే కాదు.. ఇవి కూడా మీ రక్తంలో చక్కెరను పెంచుతయ్
డయాబెటీస్ పేషెంట్లు స్వీట్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ స్వీట్లు మాత్రమే కాదు మరికొన్ని ఆహారాలు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి.
diabetes diet
పండుగ సీజన్ వచ్చేసింది. రాఖీ పండుగకు చాలా మంది స్వీట్లను ఎక్కువగా తింటుంటారు. కానీ స్వీట్లు మన రక్తంలో చక్కెర స్థాయిని చాలా ఫాస్ట్ గా పెంచుతాయన్న ముచ్చట మనందరికీ తెలుసు. అయితే స్వీట్స్ మాత్రమే కాదు.. ఇంకొన్ని ఆహారాలు కూడా మన బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతాయి. అవేంటంటే..
diabetes
రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా పెరుగుతాయి?
రక్తంలో చక్కెర స్థాయిలు వివిధ కారకాల వల్ల పెరుగుతాయి. ముఖ్యంగా కార్భోహైడ్రేట్ల వల్లే ఎక్కువగా పెరుగుతాయి. కాగా కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ప్రధాన శక్తి వనరులు. అయితే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు అవి గ్లూకోజ్ గా విచ్ఛిన్నమవుతాయి. ఇది రక్తప్రవాహంలోకి గ్రహించబడే సాధారణ చక్కెర. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి శరీరం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అయితే ఒక్క స్వీట్లు మాత్రమే కాదు.. ఇతర ఆహారాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అవేంటేంట..
వైట్ బ్రెడ్, శుద్ధి చేసిన ధాన్యాలు
వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, శుద్ధి చేసిన పాస్తా వంటి ఎక్కువ ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు త్వరగా గ్లూకోజ్ గా విచ్ఛిన్నమవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఫాస్ట్ గా పెంచుతాయి. ఈ ఆహారాల్లో తృణధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఉండదు. ఇది జీర్ణక్రియ, గ్లూకోజ్ శోషణను మందగించడానికి సహాయపడుతుంది.
ఆలుగడ్డ
ఆలుగడ్డలను రోజూ తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డ ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహారాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇలాంటి సమస్య రావొద్దంటే ఆలుగడ్డలను ఉడికించి లేదా కాల్చి తినాలి.
diabetes diet
పండ్ల రసాలు
పండ్లతోని జ్యూస్ ను తయారుచేసుకునే టైం లేని వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు బయట దొరికే క్యాక్ చేసిన రాలను తాగుతుంటారు. కానీ ప్యాకేజ్డ్ పండ్ల రసాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటిలో ఫైబర్ ఉండదు. ఈ జ్యూస్ లను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఎందుకంటే పండ్లలో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ పెరగకుండా నిరోధిస్తుంది.
diabetes
ప్రాసెస్ చేసిన స్నాక్స్
ప్రాసెస్ చేసిన స్నాక్స్ కూడా మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ఎక్కువ చక్కెరలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర పెరిగేందుకు కారణమవుతాయి.