Health Tips: మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!
Health Tips: నేడు కూర్చుని చేసే ఉద్యోగాల కారణంగా చాలామంది ప్రజలు నడుం నొప్పి, మెడ నొప్పులతో బాధపడుతున్నారు. వీటిని అశ్రద్ధ చేస్తే దీర్ఘకాలిక నొప్పులుగా మారే ప్రమాదం ఉంది అయితే ఈ చిట్కాలు పాటించడం ద్వారా మెడ నొప్పి తగ్గుతుందట అదేంటో చూద్దాం.
సాధారణంగా శరీరంలో కండరాల పాత్ర చాలా ముఖ్యమైనది. చేతులు, కాళ్లు, మెడ మొదలేనివి ఆటోమేటిక్గా పనిచేయటానికి కండరాలు ఎంతో అవసరం. ఇది ప్రోటీన్ తో తయారు చేయబడతాయి. అయితే ఈ కండరాలు ఒత్తిడి వలన వయసు పైబడటం వలన బలహీనపడుతూ ఉంటాయి.
దీని వలన మనం నొప్పులకి గురవుతూ ఉంటాము. అలా ఒత్తిడికి, నొప్పులకి గురయ్యే ప్రాంతాలలో మెడ ముఖ్యమైనది. ఎందుకంటే అది మాత్రమే ఎక్కువ శాతం కుంచించుకుపోయే మరియు విస్తరించే ధోరణి కలిగి ఉంటుంది. మెడ శరీరం యొక్క బలమైన భాగం, ఇది చిన్న డిస్క్లతో కూడుకొని ఉంటుంది.
ఆ డిస్కుల మధ్య ఒక ద్రవం వ్యాపిస్తుంది. ఈ కండరాలు తలని పట్టుకోవటమే కాకుండా మెదడుకు రక్తప్రసరణ మరియు శ్వాసక్రియకు కూడా సహాయపడతాయి. కాబట్టి మెడ కండరాలు దృఢంగా, ఒత్తిడికి గురికాకుండా ఉంచుకోవడం మంచిది.
అలాగే ఈ మెడ నొప్పి తగ్గించుకోవడానికి వేడి నీళ్లు లేదా చల్లనీలతో స్నానం చేస్తే తగ్గుముఖం పడుతుంది. అలాగే వ్యాయామం చేయడం కూడా నడుము నొప్పి తగ్గటానికి ఉపయోగపడుతుంది. అలాగే వెల్లుల్లిలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, కాబట్టి మెడ కండరాలలో మంట తగ్గడానికి వెల్లుల్లిని ఆహారముగా చేర్చుకోవచ్చు.
అలాగే వెల్లుల్లి నూనెను మెడ భాగంలో అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అదే సమయంలో ప్రతిరోజూ ఉదయం పూట రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను నమలండి అలాగే ఒక చెంచా తేనెను త్రాగండి ఇలా చేయడం వలన మెడ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే ఒక ఇంచి అల్లం ముక్కను వేడి నీళ్లలో వేసి బాగా మరిగిన తర్వాత బయటకు తీసి తాగితే మెడ నొప్పి తగ్గుతుంది. ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ ని వాటర్ లో కలుపుకొని స్నానం చేయడం వలన కండరాలలో వాపు మరియు అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.