Health Tips: పరిగడుపున వీటిని తినకండి.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే?
Health Tips: ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం ఆ రోజంతా మన ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి పరిగడుపున ఏది పడితే అది తినకూడదు. పరగడుపున మనం ఏం తినకూడదు.. తింటే ఎలాంటి సమస్య వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి నుంచి ఖాళీ కడుపుతో ఉండటం వలన పొద్దున్న మనం తినే మొదటి ఆహారమే ఆ రోజంతా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. కాబట్టి పొద్దున్ను తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. కొందరు ఖాళీ కడుపుతో టీ లేకపోతే కాఫీ తాగుతారు.
మరికొందరు గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగుతారు. కానీ ఖాళీ కడుపుతో వీటిని తాగటం వలన పేగులకి హాని కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తేనే స్వచ్ఛమైనది దొరకటం లేదు. ఇప్పుడు తేనే నూటికి ఎనభై శాతం వరకు చక్కెర పాకంతో తయారు చేస్తున్నారు.
కాబట్టి పరగడుపునే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగకండి. అలాగే ఖాళీ కడుపుతో టీలు, కాఫీలు తాగటం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది.
అలాగే పెరుగు తింటే కడుపు చల్లగా ఉంటుందని చాలా మంది కాళీ కడుపుతో పెరుగు తింటారు. అది కూడా కడుపుకి మంచిది కాదు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కడుపులో ఎసిడిటీ పెరగడానికి కారణం అవుతుంది.
కేవలం పెరుగు మాత్రమే కాదు..పాలతో చేసిన ఏ ఆహారాన్ని ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే పుల్లని పండ్లను కూడా కాళీ కడుపుతో తినకూడదు. ఇది యాసిడ్ ని ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ఉండే ఫైబర్, ప్రక్టోజ్ కడుపు ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయి.
కాబట్టి నారింజ, బేరి పండు వంటి పుల్లని పండ్లని పరగడుపున తినకండి. అలాగే జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కానీ పరగడుపున తాగటం మంచిది కాదు. జ్యూస్ తాగటం వలన ప్యాంక్రియాస్ పై అదనపు భారం పడుతుంది. దీనివలన కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఖాళీ కడుపుతో జ్యూస్ తీసుకోకండి.