MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • వాయు కాలుష్యంతో ఏటా ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు?

వాయు కాలుష్యంతో ఏటా ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు?

వాతావరణంలోని అధిక వాయు కాలుష్యం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) కలుగుతాయి. వాయు కాలుష్యం (Air pollution) కారణంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాంతక సమస్యల బారినపడి మరణించే వారి సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.   

Navya G | Asianet News | Published : Mar 07 2022, 03:02 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

గాలిలో సల్ఫర్, నైట్రేట్లు, అమ్మోనియా, సోడియం, క్లోరైడ్, బ్లాక్ కార్బన్, ఖనిజాల ధూళి వంటివన్నీ కాలుష్య కణలే (Pollution particles). గాలిలో ఉండే అతి చిన్న కణాలన్నిటినీ మనం పీల్చుకున్నప్పుడు ఆరోగ్యానికి హాని (Harm) కలుగుతుంది. 10 మైక్రో మీటర్లు కంటే పెద్ద కణాలను మాత్రమే ముక్కు, ఊపిరితిత్తులు ఫిల్టర్ చేస్తాయి. అంతకంటే చిన్న కణాలు ఊపిరితిత్తులు, ముక్కులోకి వెళ్లగలవు.
 

26
Asianet Image

2.5 మైక్రో మీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం ఉన్న కాలుష్య కారకాలు ఊపిరితిత్తులు (Lungs), ముక్కును (Nose) దాటుకుని మనిషి రక్తంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం వాయుకాలుష్యం అని వైద్యులు చెబుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
 

36
Asianet Image

అధిక కాలుష్య కారక దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉంటే మూడో స్థానంలో భారతదేశం ఉంది. ప్రజలు స్వచ్ఛమైన గాలి నాణ్యత గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా (Healthy) ఉంటారు. దాంతో అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు. అధిక వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ, గుండె, మెదడు పనితీరుపై ప్రభావం (Effect) కలుగుతుంది.
 

46
Asianet Image

వాయు కాలుష్య ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, గుండె,  శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధిగ్రస్తులు (Diseased) వారిపైన వాయు కాలుష్య  ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఊపిరితిత్తులు నాజూగ్గా ఉంటాయి.  వాయు కాలుష్యం కారణంగా పిల్లల ఆరోగ్యానికి ముప్పు (Threat) కలుగుతుంది. కనుక పిల్లలకు బడులకు పంపించే విషయములో జాగ్రత్త వహించాలి. వాయు కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాలలోని బడులకు పంపడం మంచిది.
 

56
Asianet Image

అలాగే వాయు కాలుష్యం కారణంగా కంటి దురదలు, వికారం, తలనొప్పి వంటి చిన్నచిన్న అనారోగ్యాలు ఏర్పడి అవి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. కలుషిత వాతావరణం కారణంగా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గి నిదానంగా అది ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. ఇలా దీర్ఘకాలం పాటు విషపూరితమైన వాయువులను (Toxic gas) పీల్చడంతో అత్యంత ప్రమాదకరమైన ఊపిరితిత్తుల కేన్సర్ (Lung cancer) వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
 

66
Asianet Image

ఇంతటితో ఆగకుండా ఈ వాయు కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల దిగువ భాగాలకు చేరి శ్వాసనాళాల వాపు (Inflammation of the airways) వంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది. కనుక వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం (Attempt) చేస్తూ ఆరోగ్యకరమైన వాయువును పీల్చుకుంటే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved