MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • ఉదయం ఈ పనులు చేస్తే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది

ఉదయం ఈ పనులు చేస్తే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది

మందును ఎక్కువగా తాగడం, మానసిక ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం వల్ల రక్తపోటు బాగా పెరుగుతుంది. ఈ అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం వంటి ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అనికూడా అంటారు. ఎందుకంటే ఇది ఎలాంటి లక్షణాలను చూపించకుండా మనిషి ప్రాణాలను ఇట్టే తీసేయగలదు. ప్రస్తుతం ఈ సమస్య యువతకు కూడా వస్తోంది. రక్త నాళాల గోడలపై రక్తం కలిగించే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తిలో రక్తపోటు 120/80 మి.మీ గా ఉంటుంది. రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. మందును అతిగా తాగడం, మానసిక ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్ చేయడం వంటి కొన్ని కారణాల వల్ల రక్తపోటు బాగా పెరుగుతుంది. ఈ రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఉదయం కొన్ని పనులను చేస్తే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సమయానికి నిద్రలేవడం

ప్రతిరోజూ ఉదయంపూట సమయానికే నిద్రలేవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది మీ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

39
Image: Getty Images

Image: Getty Images

ఒక గ్లాస్ నీటిని తాగడం

ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటిని తాగడం అస్సలు మర్చిపోకండి. ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

49
Image: Getty

Image: Getty

వ్యాయామం

అధిక రక్తపోటును నియంత్రించడానికి వ్యాయామం కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే  ప్రతిరోజూ ఉదయం కనీసం ముప్పై నిమిషాలైనా వ్యాయామం చేయండి. ఇందుకోసం మీరు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటివాటివి  చేయొచ్చు. ఇవి మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుతాయి కూడా. 
 

59

యోగా

యోగా వంటి పనులను చేయడం వల్ల కూడా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. యోగా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
 

69
Image: Getty Images

Image: Getty Images

ఆహారంలో మార్పులు

రక్తపోటును నియంత్రించడానికి మీ ఆహారంలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం మీరు చేయాల్సిన మొదటి పని ఉప్పును తగ్గించడం. సాధ్యమైనంత వరకు ఉప్పు ఎక్కువగా ఉండే ప్యాకేజ్డ్ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి. ఇది రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
 

79

ఆరోగ్యకరమైన ఆహారం

రక్తపోటును నియంత్రించడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. అందుకే మీరు ఉదయాన్నే పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలను పుష్కలంగా తినండి. 
 

89
Image: Getty

Image: Getty

కాఫీ తాగడం మానుకోండి

ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు. కెఫిన్ మీ రక్తపోటును పెంచుతుంది. అందుకే దీన్ని తాగకుండా మీ రక్తపోటు అదుపులో ఉంటుంది. 
 

99
Image: Getty

Image: Getty

స్మోకింగ్

స్మోకింగ్ చేయడం వల్ల కూడా అధిక రక్తపోటు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. మితిమీరిన ధూమపానం హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా దారితీస్తుంది. అందుకే స్మోకింగ్ ను పూర్తిగా మానేయండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved