MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ జ్యూస్ లను ఉదయాన్నే తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ఈ జ్యూస్ లను ఉదయాన్నే తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కొవ్వు ఎక్కువున్న ఆహారాలు, నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలను తినడం, వ్యాయామం చేయకపోవడం, స్మోకింగ్, మందును ఎక్కువగా తాగడం వంటి అలవాట్లు మీ ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అయితే కొన్ని పానీయాలు మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
cholesterol

cholesterol

ప్రస్తుత కాలంలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణాలెన్నో ఉన్నాయి. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతున్నాయి. కొవ్వు ఎక్కువున్న ఆహారాలు, నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలను ఎక్కువగా తినడం, వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం, మందును ఎక్కువగా తాగడం వంటివన్నీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర మాంసం, కొవ్వు, స్వీట్లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను నివారించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఉదయం కొన్ని డ్రింక్స్ ను తాగినా.. కొలెస్ట్రాల్ తగ్గుతుందట. అవేంటంటే.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గ్రీన్ టీ - నిమ్మకాయ - తేనె

గ్రీన్ టీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి . గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే ఉదయాన్నే గ్రీన్ టీ ని తాగడం అలవాటు చేసుకోండి. గ్రీన్ టీ తయారు చేసేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది.
 

34

పసుపు పాలు

పసుపు పాలు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే  పసుపు పాలు చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. అలాగే మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 

44

బీట్ రూట్ - క్యారెట్ జ్యూస్

బీట్ రూట్, క్యారెట్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు. ఈ రెండూ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఉదయాన్నే బీట్ రూట్-క్యారెట్ జ్యూస్ ను తాగొచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image2
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved