వర్షాకాలంలో నిజంగా ఆకుకూరలను తినొద్దా?
నిజానికి ఆకు కూరల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలుంటాయి. వీటిని తింటే ఎన్నో పోషక లోపాలు పోతాయి. కానీ వానలు పడుతున్నప్పుడు ఆకు కూరలను దూరంగా ఉండాలని చాలా మంది చెప్తుంటారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?
వర్షాకాలంలో జోరు వానలతో పాటుగా.. ఎన్నో రకాల అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పు కూడా పెరుగుతుంది. వానాకాలం ఎన్నో రోగాలు వచ్చేలా చేస్తుంది. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఏవి పడితే అవి తినకూడదు. చెడు ఆహారం సర్వ రోగాలకు దూరితీస్తుంది మరి. అయితే వర్షాకాలం హెల్త్ కేర్ కు సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిలో నిజం లేకున్నా జనాలు మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు. దీనిలో ఒకటి ఆకు కూరలకు దూరంగా ఉండాలనేది ఒకటి.
ఆరోగ్య నిపుణులు ప్రకారం.. వర్షాకాలంలో ఆకుకూరలను తినకూడదనేది ఒక తప్పుడు వాదన. వానాకాలంలో ఆకుకూరలను తింటే కడుపు సమస్యలు వస్తాయని చాలా మంది చెప్తుంటారు. ఈ కారణంగా వర్షాకాలంలో చాలా మంది ఆకుకూరలకు దూరంగా ఉంటారు.
leafy vegetables
నిజానికి ఆకు కూరల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఆకు కూరల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, బీటా కెరోటిన్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకు కూరలను తింటే కళ్లు బాగా కనిపిస్తాయి. కంటి సమస్యలు తగ్గిపోతాయి. ఎముకలు బలంగా అవుతాయి. రక్తహీనత సమస్య పోతుంది. పాలిచ్చే తల్లులు ఆరోగ్యంగా ఉంటారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది.
డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఆకు కూరలను తింటే మధుమేహానికి దూరంగా ఉంటారని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఆకు కూరలతో ఇవేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అందుకే వీటిని పూర్తిగా తినకుండా ఉండటం మంచిది కాదు. మన దేశంలో ఎక్కువగా వాడే ఆకుకూరలైన పాలకూర, మునగాకు వంటి వాటిని కూడా వర్షాకాలంలో తినడం మానేస్తారు.
Image: Getty Images
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వర్షాకాలంలో ఆకుకూరలకు మొత్తమే దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఈ వాతావరణంలో అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే సురక్షితంగా ఉండటానికి ఆకుకూరలు తినడానికి ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
ముందుగా దెబ్బతిన్న అంటే పురుగులు తిన్న ఆకులను కూరకు ఉపయోగించొద్దు. తాజా ఆకులను మాత్రమే ఎంచుకోవాలి. ఆకులను ఉడకబెట్టే ముందు బాగా కడగాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీటిని మరిగించి అందులో ఆకులు వేయాలి. ఆకులను నీటిలో రెండు మూడు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి నేరుగా చల్లటి నీటిలోకి వేయాలి. ఆకులు లేదా కూరగాయలలో ఏవైనా టాక్సిన్స్ ఉంటే.. పోషకాలు కోల్పోకుండా ఉండటానికి, ఆకులు, కూరగాయలు తాజాగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. దీని తర్వాత మీరు ఈ ఆకులను కూర చేసుకోవచ్చు.