Health Tips: చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఉపశమనం కోసం ఇంటి చిట్కాలు మీకోసమే?
Health Tips: వర్షాకాలంలో మనం ఎక్కువగా ఎదుర్కొనే సమస్య చర్మం పై వచ్చే ఇన్ఫెక్షన్ల తో బాధపడుతూ ఉంటాము. ఇది ఇబ్బంది కలిగించే సమస్య అయినా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఉపశమనం పొందవచ్చు అది ఎలాగో చూద్దాం.
వర్షాకాలంలో మనం ఎక్కువగా చర్మ సమస్యలకి గురవటానికి కారణం ఆ సమయంలో మీ చర్మం ఎక్కువగా పోటీ బారడం దీనివలన దురద, ఎలర్జీలు వంటివి వస్తూ ఉంటాయి. అయితే వంటింట్లో ఉండే వస్తువులతోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంట అది ఎలాగో చూద్దాం.
రోగ నిరోధక ప్రతి చర్యల సమయంలో శరీరంలో విడుదలయ్యే రసాయన పదార్థం హిస్టామిన్ విడుదల చేయడం వలన దురద వస్తుంది. ఈ దురద సమస్య తప్పించుకోవాలంటే ఓట్స్ బాగా ఉపయోగపడతాయంట ఎందుకంటే ఓట్స్ చర్మం పొడిబారటం మరియు చిరాకు నుంచి రక్షిస్తుంది.
ఓట్స్ లో సహజ యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆంటీ ఇంప్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఓట్స్ ను పౌడర్ గా చేసి నీటిలో కలిపి సెమీ సాలిడ్ గా చేసి ఆ పేస్ట్ ని దురద మరియు దద్దురు ఉన్న స్థలంలో రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అలాగే చర్మ సమస్యలకు మరొక అద్భుతమైన ఔషధం వేపాకులు ఈ వేపాకులని వేడి నీటిలో నానబెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయడం వలన దద్దుర్లు దురదలు త్వరగా తగ్గుతాయి.
అలాగే కొబ్బరి నూనె వంటి క్యారియర్ ఆయిల్ తో పేపర్ మెంట్ నూనెను కరిగించి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వలన కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని తేనెలో దూదిని ముంచి దురద ఉన్న ప్రాంతంలో అప్లై చేసి పది పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వలన కూడా దురదలు దూరమవుతాయి.
a
అలాగే కలబంద గుజ్జు కూడా చర్మము మంట వాపుని తగ్గిస్తుంది. అలాగే మీరు స్నానం చేసే నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలుపుకొని స్నానం చేయడం వలన చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.