MonkeyPox: ప్రమాదకరమైన మరో మూడు కొత్త లక్షణాలు..!
తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకటి, రెండు కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఈ మంకీ పాక్స్ భయం మొదలైంది. కాగా.. తాజాగా.. ఈ మంకీ పాక్స్ కు సంబంధించి మూడు కొత్త లక్షణాలను కూడా గుర్తించారు.

కరోనా మహమ్మారి మనల్ని ఎంతలా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు రెండేళ్ల పాటు కనీసం ఇంట్లో నుంచి కాలు కూడా బయటకు పెట్టలేకపోయాం. ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాం. ఇప్పుడిప్పుడే కాస్త మాస్క్ లు తీసి ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మంకీ పాక్స్ పేరిట మరో మహ్మారి తయారై.. మనల్ని ఇబ్బంది పెట్టడ మొదలుపెట్టింది.
monkeypox
దేశ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 16, 836 మందికి ఈ మంకీ పాక్స్ సోకినట్లు గుర్తించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకటి, రెండు కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఈ మంకీ పాక్స్ భయం మొదలైంది. కాగా.. తాజాగా.. ఈ మంకీ పాక్స్ కు సంబంధించి మూడు కొత్త లక్షణాలను కూడా గుర్తించారు.
ఇప్పటి వరకు మంకీ పాక్స్ అంటే.. చర్మం మీద దద్దుర్లు వస్తాయని అందరికీ తెలుసు. అయితే.. తాజాగా మరికొన్ని కొత్త లక్షణాలు వెలుగుచూశాయి. అవేంటంటే.. జననేంద్రియాల్లో గాయాలు, నోటిలో పుండ్లు, పాయువుపై పుండ్లు రావడం గా గుర్తించారు.
ఈ మంకీ పాక్స్ సోకిన వారిలో పది మందిలో ఒకరికి ఈ కొత్త లక్షణాలు కనపడుతున్నట్లు గుర్తించారు. ఈ మంకీ పాక్స్ లక్షణాలు.. లైంగికంగా సక్రమించే అంటు వ్యాదుల మాదిరిగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే.. చాలా మంది మంకీ పాక్స్ లక్షణాలు తొందరగా గుర్తించలేకపోతున్నారని.. ఈ క్రమంలో.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని వారు చెబుతున్నారు. కొందరేమో.. నోట్లో పుండ్లు రావడం వల్ల ఆహారం తినలేక ఇబ్బంది పడుతూ ఆస్పత్రి పాలౌతున్నట్లు తేలడం గమనార్హం.
monkeypox virus
చాలా మంది ఈ లక్షణాలను మంకీ పాక్స్ గా గుర్తించకపోవడం వల్ల.. వాటి వల్ల ప్రమాదం పెరిగి.. ఇతరులకు తొందరగా వ్యాప్తిచెందుతోందని చెబుతున్నారు. వారు కూడా సమస్య తీవ్రతరమై ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.
సాంప్రదాయ కోణంలో మంకీపాక్స్‌లో సంక్రమించే ఇన్‌ఫెక్షన్ చాలా ముఖ్యం. అది ఏ విధమైన సన్నిహిత శారీరక సంబంధం ద్వారా అయినా సంక్రమించవచ్చు ." అని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త మంకీపాక్స్ వ్యాప్తి చెందే మార్గాలపై, ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న సమూహాలపై వెలుగునిస్తుంది. ఇది కొత్త కేసుల గుర్తింపును గుర్తించడంలో, ముఖ్యంగా అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ల వంటి నివారణ వ్యూహాలను అందిస్తుంది.