MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పుదీనా.. కొత్తమీర.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

పుదీనా.. కొత్తమీర.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

పుదీనా, కొత్తిమీర రెండూ మంచి ఔషదగుణాలున్న ఆకులు. ఈ రెండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటి ఔషదాల పరంగా ఏది బెస్ట్ అంటే?  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2023, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
mint leaves

mint leaves

కొత్తిమీర, పుదీనా ఆకులను  మనం వివిధ కూరల్లో ఉపయోగిస్తుంటాం. నిజానికి ఈ రెండూ మంచి వాసనను కలిగి ఉంటాయి. అలాగే ఫుడ్స్ ను ఎంతో టేస్టీగా చేస్తాయి. అందుకే వీటిని పానీయాలు, సలాడ్లు, రుచికరమైన వంటల్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు. పుదీనాను ఎసెన్షియల్ ఆయిల్, మెంతోల్ మౌత్ ఫ్రెష్నర్లు, పానీయాలు, యాంటీసెప్టిక్ మౌత్ వాష్ లు, టూత్ పేస్ట్, చూయింగ్ గమ్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. 

25
Image: Getty

Image: Getty

పుదీనాలో ఉండే కార్మినేటివ్ గుణాలు జీర్ణ సమస్యలను దూరం తగ్గిస్తాయి. మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడడే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంటు పుదీనాలో పుష్కలంగా ఉంటాయి. 
 

35
coriander leaves

coriander leaves

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్ డీఎల్ ను పెంచడానికి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. మెక్సికన్, ఇండియన్, మిడిల్ ఈస్టర్న్ తో సహా వివిధ రకాల వంటకాల్లో కొత్తిమీర ఆకులను సాధారణంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.

45
coriander

coriander

కొత్తిమీర కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. కొత్తిమీర శరీరం నుంచి అదనపు సోడియాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ రిస్క్ లను నివారిస్తుంది. అలాగే వీటిని కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా కొత్తిమీర కూడా మన గుండెకు మేలు చేస్తుంది.
 

55

కొత్తిమీరలో విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎతో పాటు ఈ రెండు పోషకాలు క్రమంగా మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. పుదీనా, కొత్తిమీర ఆకుల వాడకం మీరు తయారుచేసే వంటకంపై ఆధారపడి ఉంటుంది. పుదీనా శరీరం చల్లబరచడానికి, జీర్ణ సమస్యలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే కొత్తిమీర ఆకులు వంటకాలకు ప్రత్యేకమైన వాసనను ఇస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Recommended image2
Soaked Almonds: రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Malaika Arora Fitness: మలైకా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved