MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • అధిక బరువు తగ్గించకుంటే.. గుండెకు చేటు..!

అధిక బరువు తగ్గించకుంటే.. గుండెకు చేటు..!

స్థూలకాయం సమస్యతో ఎంత ఎక్కువ కాలం బాధపడితే... అంత ఎక్కువగా గుండె సంబంధిత జబ్బులతో పాటు మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలు దాడి చేస్తాయని ఈ పరిశోధనలో వెల్లడైంది.
 

ramya Sridhar | Published : Sep 29 2021, 11:41 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
weight loss

weight loss


ఈ రోజుల్లో అధిక బరువుతో  బాధపడేవారు చాలా మందే ఉన్నారు.  పని ఒత్తిడి, లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్స్ కి అలవాటు పడి.. ఇలా పలు కారణాల వల్ల  ఈ రోజుల్లో అందరూ బరువు పెరుగుతున్నారు.  అయితే.. ఈ బరువు పెంచకుంటూపోతే.. తీవ్ర అనర్థాలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు లావుగా ఉండటం వల్ల.. గుండె సమస్యలు వస్తాయని చాలా మందికి తెలిసే ఉంటుంది.

28
Asianet Image

అయితే.. అదొక్కటి మాత్రమేకాదట. అధిక బరువు కారణంగా మొత్తం శరీరానికే హానీ చేకూరుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థూలకాయం వల్ల గుండె జబ్బులు అధికం అవడంతో పాటు హై బీపీ కూడా పెరుగుతోంది. మధుమేహం లాంటి జబ్బులు సైతం పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

38
Asianet Image

ఓ అధ్యయనం ప్రకారం.. మనిషి స్థూలకాయంతో బాధపడే కాలానికి.. వారిపై దాడి చేసే జబ్బులకు సంబంధం ఉందని తేలింది. 10 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న 20,746 మందిపై చేసిన ఈ అధ్యయనంలో విస్తుగొలిపే అనేక విషయాలు వెలుగుచూశాయి. స్థూలకాయం సమస్యతో ఎంత ఎక్కువ కాలం బాధపడితే... అంత ఎక్కువగా గుండె సంబంధిత జబ్బులతో పాటు మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలు దాడి చేస్తాయని ఈ పరిశోధనలో వెల్లడైంది.

48
Asianet Image

లావుగా లేని వారితో పోల్చుకుంటే ఎక్కువ కాలం పాటు స్థూలకాయంతో బాధపడిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది.స్థూలకాయం లేని వారితో పోల్చుకుంటే.. 20 నుంచి 30 ఏళ్ల పాటు లావుగా ఉండి స్థూలకాయంతో బాధపడిన వారిలో ఏకంగా 20 శాతం HbA1c ఎక్కువ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

58
Asianet Image

స్థూలకాయం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం ఒక సమస్య అయితే.. శరీరానికి మేలు చేసే గుడ్ కొలెస్ట్రాల్‌ తగ్గిపోవడం మరో సమస్యగా కనిపిస్తోంది. లావుగా ఉండటం వల్ల కేవలం ఈ సమస్యలు మాత్రమే కాదు.. ఇలాంటివే ఇంకెన్నో ముఖ్యమైన ఇతరత్రా సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

68
Asianet Image

లావుగా ఉండటం వల్ల శరీరంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇన్సూలిన్, ఇస్ట్రోజెన్, సెక్స్ హార్మోన్స్, రోగ నిరోధక శక్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తాయి. లావుగా ఉండటం వల్ల శరీరంలో కలిగే మార్పులు కొన్నిరకాల క్యాన్సర్ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

78
Asianet Image

మహిళలకు సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం  మహిళల్లో స్థూలకాయం సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అధిక కొవ్వు కణాలు, హైపోథైరాయిడ్ వంటివి సంతానం కలగకుండా చేసే ప్రమాదం ఉందని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

88
Asianet Image

ఎక్కువ కాలం పాటు లావుగా ఉన్న మగ వారిలో సెక్స్ సామర్థ్యంపైనా దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థూలకాయం కారణంగా రక్త నాళాలు పనితీరు తగ్గిపోవడంతో పాటు టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవడమే అందుకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. స్థూలకాయం -  సెక్స్ సామర్థ్యం సంబంధిత అంశాలపై జరిగిన అనేక పరిశోధనల్లో ఇదే ఫలితం వెలువడింది.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories