ఉదయం లేచిన వెంటనే ఇలా అనిపిస్తుందా? అయితే మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టే..!
ప్రస్తుతం చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే ఉదయం లేచిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి మీలో కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు.

lung cancer
కొన్ని రకాల క్యాన్సర్లు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను చూపించవు. ఇంకొన్ని కొన్ని తేలికపాటి లక్షణాలను చూపిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో కూడా ఆలాగే జరుగుతుంది. దీనిలో సాధారణంగా ప్రారంభ దశలో ఎలాంటి సంకేతాలు గానీ లక్షణాలు గానీ కనిపించవు. ఈ క్యాన్సర్ ను ప్రారంభదశలో గుర్తించలేం. అయినప్పటికీ దీనిలో కూడా తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. కాకపోతే అవి పెద్ద సమస్య లాగ కనిపించవు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే ఉదయం లేచిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తేలిగ్గా తీసిపారేయకూడదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల ఉదయం ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్వరం
యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే.. జ్వరంతో బాధపడతారు. ఇది సాధారణంగా సంక్రమణ వల్ల వస్తుంది. అంటే రేడియోథెరపీ లేదా కెమోథెరపీ కారణంగా న్యూట్రోపెనిక్ జ్వరం వస్తుంది. ఆ తర్వాత కణితి పురోగతి వల్ల జ్వరం వస్తుంది. న్యూట్రోపెనిక్ జ్వరం అనేది ఒక రోగి న్యూట్రోపెనిక్ అయినప్పుడు వస్తుంది. సాధారణ న్యూట్రోఫిల్స్ సంఖ్య (ఒక రకమైన తెల్ల రక్త కణాలు) కంటే తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కారణంగా ఆందోళన, నిరాశ సైకోజెనిక్ జ్వరానికి దారితీస్తుంది.
చెమటతో తడిసి నిద్రలేవడం
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారు విపరీతమైన చెమటతో తడిసిపోయి నిద్రలేస్తారు. క్యాన్సర్ తో జ్వరం రావడం ఇందుకు కారణం కావొచ్చు. ఇది మీ శరీరాన్ని చల్లబరచడానికి చెమట ఎక్కువగా పట్టేలా చేస్తుంది.
పొడి దగ్గు
మూడు వారాల కంటే ఎక్కువ పొడి దగ్గు ఉంటే మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా పొడి దగ్గు లక్షణాలను చూపిస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారిలో కనీసం 65% మందికి రోగ నిర్ధారణ సమయానికి దగ్గు ఉంటుంది.
కఫంలో రక్తం
కఫంలోని రక్తం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు హెచ్చరిక సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.ఇది ఊపిరితిత్తులలో తయారైన మందపాటి రకం శ్లేష్మం.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇతర హెచ్చరిక సంకేతాలు
ఛాతీ ఇన్ఫెక్షన్లు తరచుగా రావడం
దగ్గు వల్ల రక్తం పడటం
దగ్గినప్పుడు నొప్పి
ఎప్పుడూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
నిరంతర అలసట
ఆకలి లేకపోవడం
చాలా బరువు తగ్గడం
వేళ్లు మరింత వక్రంగా మారడం లేదా వాటి చివరలు పెద్దవిగా మారడం (ఫింగర్ క్లబ్బింగ్)
మింగేటప్పుడు గొంతు నొప్పి
గురక
గద్గద స్వరం
ముఖం లేదా మెడ వాపు
నిరంతర ఛాతీ లేదా భుజం నొప్పి
lung cancer
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇతర హెచ్చరిక సంకేతాలు
ఛాతీ ఇన్ఫెక్షన్లు తరచుగా రావడం
దగ్గు వల్ల రక్తం పడటం
దగ్గినప్పుడు నొప్పి
ఎప్పుడూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
నిరంతర అలసట
ఆకలి లేకపోవడం
చాలా బరువు తగ్గడం
వేళ్లు మరింత వక్రంగా మారడం లేదా వాటి చివరలు పెద్దవిగా మారడం (ఫింగర్ క్లబ్బింగ్)
మింగేటప్పుడు గొంతు నొప్పి
గురక
గద్గద స్వరం
ముఖం లేదా మెడ వాపు
నిరంతర ఛాతీ లేదా భుజం నొప్పి