ఇలా అయితే మీకు బీపీ తక్కువున్నట్టే.. జాగ్రత్తగా ఉండండి
అధిక రక్తపోటు ఒక్కటే ప్రమాదకరమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజమేంటంటే.. అధిక రక్తపోటు ఒక్కటే కాదు.. తక్కువ రక్తపోటు కూడా అంతే ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధమనుల గోడలపై రక్తం కలిగించే ఒత్తిడి తగినంతగా లేకుంటే.. తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ అని పిలువబడే అనారోగ్య సమస్య బారిన పడతారు. చాలా మంది అధిక రక్తపోటు ఒక్కటే ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని నమ్ముతారు. నిజమేంటంటే అధిక రక్తపోటుతో పాటుగా తక్కువ రక్తపోటు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అసలు రక్తపోటు తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...
lower blood pressure
మైకము లేదా తేలికపాటి తలనొప్పి: మీకు ఉన్నట్టుండి మూర్ఛపోతున్నట్టుగా లేదా గది మీ చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించిందా? ఎక్కువసేపు కూర్చున్న లేదా పడుకుని లేచిన తర్వాత నిలనిలబడినప్పుడు ఇలా కళ్లు తిరిగిట్టుగా అనిపిస్తే మీకు రక్తపోటు తక్కువగా ఉన్నట్టేనంటున్నారు నిపుణులు. వీటితో పాటుగా అస్పష్టమైన దృష్టి కూడా తక్కువ రక్తపోటుకు సంకేతమే అంటున్నారు నిపుణులు.
అలసట లేదా బలహీనత: రోజువారి పనులను చేసుకోవడానికి కూడా మీకు చేతకాకపోయినా.. శక్తి లేకపోయినా.. మీకు లో బీపీ ఉన్నట్టేనంటున్నారు నిపుణులు. మీ కండరాలు బలహీనంగా లేదా బరువుగా అనిపించినా కూడా మీకు ఈ సమస్య ఉన్నట్టే. శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఈ సమస్య వల్లే వస్తాయి. ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో.
low blood pressure
వికారం లేదా వాంతులు: కొన్ని సందర్భాల్లో.. తక్కువ రక్తపోటు వికారం లేదా వాంతికి కారణమవుతుంది. శారీరక శ్రమలో పాల్గొన్ననప్పుడు చల్లని, క్లామి చర్మం లేదా చెమటలు ఎక్కువగా పడతాయి. మీకు రక్తపోటు చాలా తక్కువగా ఉంటే గందరగోళం లేదా స్పృహ కోల్పోవచ్చు.
నిద్ర: నిద్ర తక్కువ రక్తపోటు సాధారణ లక్షణం. ఎందుకంటే రక్త ప్రవాహం తగ్గడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. ఇది అలసట, మగత భావాలకు దారితీస్తుంది. అయితే తక్కువ రక్తపోటు సమస్య నుంచి బయటపడటానికి హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ లో బీపీ ఎన్నో అంతర్లీన సమస్యలకు కూడా కారణం కావొచ్చు. అందుకే ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించండి.