శివుడికి ఇష్టమైన ఈ ఆకు.. మనకు ఎన్నో వ్యాధులను తగ్గించే దివ్య ఔషదం
శివుని పూజలో ఖచ్చితంగా తమలపాకును సమర్పిస్తారు. అందుకే దీన్ని పవిత్రంగా భావిస్తారు. అయితే ఇది మన ఆరోగ్యానికి మాత్రం మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించి మనం ఎన్ని వ్యాధులను తగ్గించుకోవచ్చో తెలుసా?
హిందూ మతంలో తమలపాకును ఎంతో పవిత్రంగా చూస్తారు. మతవిశ్వాసాల ప్రకారం.. తమలపాకు త్రిమూర్తులకు చిహ్నం. అంటే బ్రహ్మ, విష్ణు,పరమేశ్వరులు. అందుకే పూజలో తమలపాకుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు. పవిత్రంగా చూస్తారు. ఈ తమలపాకు శివునికి ఎంతో ప్రీతికరమైనది. కానీ పవిత్రంగా భావించే ఈ ఆకు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. మీకు తెలుసా? తమలపాకు చిటికెలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. శివునికి ఇష్టమైన ఈ ఆకు మనకు చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దగ్గు, జలుబు దూరం
వాతావరణం మారుతున్నప్పుడు దగ్గు, జలుబు, జ్వరం రావడం చాలా కామన్, అంతేకాకుండా దగ్గు వల్ల ఛాతిలో బిగుసుకుపోయి ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దీని వల్ల శ్వాసతీసుకోవడానికి కూడా సరిగ్గా రాదు. అయితే తమలపాకులతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కఫంతో ఇబ్బంది పడుతుంటే.. తమలపాకుపై ఆవ నూనెను రాసి దాన్ని వేడి చేయండి. ఇప్పుడు ఈ ఆకును ఛాతీమీద పెట్టండి. ఇది ఛాతీ బిగుతును తొలగిస్తుంది. అలాగే జలుబు వెంటనే తగ్గిపోతుంది.
betel leaves
షుగర్ పేషెంట్లకు మేలు
ప్రస్తుత కాలంలో షుగర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తోంది. అయితే డయాబెటీస్ తో బాధపడుతున్న వారికి తమలపాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును దీని సహాయంతో మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించొచ్చు. తమలపాకు రసంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండాలంటే రోజూ తమలపాకు రసాన్ని తీసుకోండి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను చాలా వరకు కంట్రోల్ లో చేస్తుంది.
ఉదర సంబంధ వ్యాధులు
తమలపాకులతో మీరు పొట్టకు సంబంధించిన ఎన్నో సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఆకలి లేకపోవడం, జీర్ణ సంబంధ వ్యాధులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నయం చేయడంలో తమలపాకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. తమలపాకులను నమలడం వల్ల ఫుడ్ చాలా తొందరగా జీర్ణమవుతుంది. అలాగే కడుపులోని విషపదార్థాలు బయటకు వస్తాయి. అన్నం తిన్న వెంటనే తమలపాకులను నమలడం వల్ల కడుపునకు సంబంధించిన ఎన్నో వ్యాధులు నయమవుతాయి.
మొటిమలు, గాయాలకు చికిత్స
తమలపాకులో యాంటీ అలెర్జీ, యాంటీ సెప్టిక్ లక్షణాలుంటాయి. ఇవి క్రిములను చంపుతాయి. మీ బాడీకి ఎక్కడైనా గాయాలు అయితే అక్కడ తమలపాకు రసం అప్లై చేయండి. దీనివల్ల గాయాలు చాలా తొందరగా నయమవుతాయి. అలాగే ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు, అలర్జీల వల్ల దురద, అలెర్జీ సమస్యలు ఉంటే తమలపాకు రసంలో పసుపు కలిపి రాసుకుంటే ప్రయోజనం ఉంటుంది.