Health Tips: నోటి దుర్వాసన నలుగురిలోకి వెళ్ళనివ్వడం లేదా.. అయితే ఈ మౌత్ వాష్ ట్రై చేయండి!
Health Tips: నోటి దుర్వాసన మనల్ని ఎంత ఇబ్బంది పడుతుందంటే నలుగురిలో మాట్లాడటానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది అందుకే నేచురల్ రెమెడీస్ తో నోటి దుర్వాసన ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం.
నోటి దుర్వాసన సరిగ్గా బ్రష్ చేసుకోలేనప్పుడు, లేదంటే గొంతు ఇన్ఫెక్షన్, టాన్సిలిటీస్ వంటి సమస్యల వల్ల వస్తూ ఉంటుంది. అందుకే ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే ఈ మౌత్ వాష్ లు ట్రై చేయండి. నోటి దుర్వాసన వస్తుంది అన్నప్పుడు అల్లం, లవంగం, యాలకులు వేసి అందులో రెండు గ్లాసుల నీరు వేయండి.
నీరు సగం అయ్యేవరకు మరిగించి కాస్త చల్లారిన తరువాత కషాయంగా తీసుకోండి. ఇది కడుపుకి, నోటి దుర్వాసనకి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వేప కషాయం తాగినా, వేప పొడిని పేస్టులో కలిపి బ్రష్ చేసుకోవడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. వేపలో ఉండే యాంటీ వైరల్ ను..
తగ్గించే లక్షణాలని కలిగి ఉంటుంది. అలాగే కలబంద రసంతో నోటిని పుక్కిలించటం వల్ల కూడా నోటి దుర్వాసన తొలగిపోతుంది. అలాగే దాల్చిన చెక్క యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. నోటి దుర్వాసనను పోగొట్టడానికి దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు.
సిన్నమిక్ ఆల్టిహైడ్ అనే మూలకం దాల్చిన చెక్కలో ఉంటుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీటితో నోటిని పుక్కిలించడం వల్ల దుర్వాసన దూరమవ్వటమే కాకుండా నోరు ఫ్రెష్ గా ఉన్న భావన కలుగుతుంది.
అలాగే టీ ట్రీ ఆయిల్ ని ఉపయోగించి నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. బ్రష్ చేసుకునే సమయంలో టూత్ పేస్ట్ పై కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని ఉపయోగించడం వల్ల నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వెచ్చని ఉప్పు నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించడం వలన కొంతమేరకు నోటి దుర్వాసన తగ్గుతుంది.
దీనిని రోజువారి అలవాటుగా చేసుకుంటే నోటి దుర్వాసన క్రమేణా తగ్గుతుంది. అలాగే ఎక్కువగా నీరు తాగటం, అన్నం తిన్న వెంటనే నోటిని పుక్కిలించి కడుక్కోవడం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం వంటివి రోజువారి కార్యక్రమాలుగా పెట్టుకోండి. దీనివలన నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు.