MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మీకు అస్సలు చెమట పట్టదా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!

మీకు అస్సలు చెమట పట్టదా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!

శరీరంలో ఉన్న నీరే చెమట రూపంలో ఒంట్లోంచి బయటకు వస్తుంది. కొంతమందికి కొంచెం దూరం నడిచినా విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇంకొంతమందికి ఒక్క చుక్క కూడా చెమట పట్టదు. ఇది ఎన్నో రోగాలకు సంకతమంటున్నారు నిపుణులు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 13 2023, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చెమట మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చెమట గ్రంథుల నుంచి ఉప్పు ఆధారిత ద్రవాన్ని విడుదల చేస్తుంది. చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది అధిక ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతలో మార్పు లేదా మీ భావోద్వేగ స్థితి వల్ల వస్తుంది. శరీరం సాధారణంగా చంకలు, ముఖం, అరచేతులు, పాదాల అరికాళ్ల వంటి ప్రాంతాల నుంచి చెమటను ఉత్పత్తి చేస్తుంది. చెమట గ్రంథులు రెండు రకాలు.. ఒకటి ఎక్రిన్, రెండోది అపోక్రైన్.

26

ఎక్రిన్ చెమట గ్రంథులు మానవ శరీరం అంతటా ఉంటాయి. ఇవి చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఇది తేలికైనది. ఇది ఎలాంటి వాసన రాదు. అపోక్రైన్ చెమట గ్రంథులు ఉత్పత్తి చేసే చెమట నెత్తిమీద, చంకలు, గజ్జల జుట్టు కుదుళ్లలో కేంద్రీకృతమై ఉంటాయి. ఇది మందంగా, ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. మన శరీరం తనను తాను చల్లబరచుకోవడానికి చెమట సహజ ప్రక్రియను ఉపయోగిస్తుంది. మీ చర్మం గ్రంథులు చెమటను విడుదల చేస్తాయి. ఇది తర్వాత గాలిలోకి పోతుంది. చెమట మన చర్మాన్ని చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. 
 

36
summer sweat

summer sweat

చెమట పట్టకపోవడం లక్షణాలు

వేడిగా లేదా వేడెక్కినట్టుగా అనిపించడం
శరీర ఉష్ణోగ్రత పెరిగిన తరువాత ఇబ్బంది పడటం లేదా చల్లబరచలేకపోవడం
Flushing
కండరాల తిమ్మిరి
వికారం, వాంతి వచ్చేలా ఉండటం
గుండె దడ
 

46

చెమట పట్టకపోవడానికి కారణాలు

మీ జీవనశైలి అలవాట్ల నుంచి చెమట లేకపోవడం వరకు శరీరంలో చెమట తగ్గడానికి లేదా మొత్తమే లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీకు చెమట పట్టకపోవడానికి కొన్ని సాధారణ కారణాలు:

చెమట గ్రంథులు లేకపోవడం
అమిలోయిడోసిస్
డయాబెటిక్ లేదా ఆల్కహాలిక్ న్యూరోపతి
దీర్ఘకాలిక ఆల్కహాల్ వాడకం
స్జగ్రెన్స్ సిండ్రోమ్, స్క్లియోడెర్మా
ఊపిరితిత్తుల క్యాన్సర్
కుష్టువ్యాధి, తీవ్రమైన కాలిన గాయాలు వంటి చర్మ రుగ్మతలు లేదా గాయాలు
చెమట గ్రంథులకు గాయం
పార్కిన్సన్ వ్యాధి
దీర్ఘకాలిక సిలికాన్ బహిర్గతం
లోమోటిల్, యాంటిడిప్రెసెంట్స్, యాంటీ ఎపిలెప్సీ మందులు, కొన్ని రక్తపోటు మందులు, కండరాల సడలింపులు వంటి మందులు
అన్హైడ్రోసిస్ తీవ్రమైన నిర్జలీకరణం లక్షణం కావొచ్చు. ఇది శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు వస్తుంది. 
 

56


అన్హైడ్రోసిస్ ఉన్న రోగులకు కొన్ని జీవనశైలి చిట్కాలు

శరీర ఉష్ణోగ్రత పెరిగితే మెడ, నుదిటి, చంకలు, గజ్జలు వంటి ప్రాంతాలకు ఐస్ ప్యాక్ వేసుకోవచ్చు.
క్రమం తప్పకుండా చల్లని నీరు లేదా కొబ్బరి నీటిని తాగాలి. 
చాలా వేడి వాతావరణంలో వ్యాయామం చేయడం మానుకోవాలి.
పరిసరాల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి ఎయిర్ కూలర్లు లేదా ఎయిర్ కండిషనర్లను ఉపయోగించాలి.
సింథటిక్ దుస్తులు ధరించడం మానుకోండి. కాటన్ ఆధారిత లేత రంగు వదులుగా ఉండే దుస్తులను వేసుకోండి. 
శరీరం వేడిగా అనిపిస్తే ముఖం, మెడ, ఛాతీపై నీటిని చల్లండి.

66

చెమట అనేది మీ చెమట గ్రంథుల ద్వారా శరీరం నుంచి ద్రవాన్ని విడుదల చేస్తుంది. చెమట పట్టడం సాధారణమే అయినప్పటికీ.. కొన్నిసార్లు మందును ఎక్కువగా తాగే రోజువారీ అలవాటు నుంచి పార్కిన్సన్ వ్యాధి వంటి రోగాల వరకు ఎన్నో కారణాల వల్ల చెమట పట్టదు. చెమట పట్టకపోవడాన్ని అన్హైడ్రోసిస్ అని పిలుస్తారు. ఇది అరుదైన పరిస్థితి. ఇలాంటి సమస్య ఉన్నవారు తప్పకుండా హాస్పటల్ కు వెళ్లాలి. ఐస్ ప్యాక్ వేయడం, పుష్కలంగా ద్రవాలను తాగడం, సాధారణ వాతావరణంలో వ్యాయామం చేయడం వంటి కొన్ని జీవనశైలి అలవాట్లు ఈ సమస్యను నివారించడానికి మీకు సహాయపడతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Apricots: ఇవి తింటే చాలు..చూస్తుండగానే బరువు తగ్గిపోతారు
Recommended image2
గ‌ర్భిణీలు పారాసిట‌మాల్ వేసుకుంటే పిల్ల‌లు ఆటిజంతో పుడుతారా.? అధ్య‌య‌నంలో తేలిన నిజం
Recommended image3
Unmarried Men: బ్రహ్మచారులకు హెచ్చరిక.. పెళ్లి చేసుకోకపోతే ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved