రొయ్యలను తీసుకుంటే మగవారిలో ఆ సమస్యలు తగ్గుతాయట!
రొయ్యలను (Prawns) తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రొయ్యల వేపుడు, రొయ్యల కూర నోటికి రుచి అందించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రొయ్యలను ఎక్కువగా వండుకుంటారు. రొయ్యలలో అనేక పోషకాలు ఉంటాయి. మరి ఇప్పుడు మనం రొయ్యలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం..
రొయ్యలలో జింక్, సెలీనియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఇ, బి, మెగ్నీషియం వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు (Omega 3 fatty acids), యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి కలుగజేసే ప్రయోజనాలు అనేకం.
శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది: రొయ్యలలో జింక్, సెలీనియం (Selenium) పుష్కలంగా ఉంటాయి. ఇవి మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. మగవారిలో వీర్యకణాల (Sperm) సంఖ్య బాగా పెరిగి వీర్యం పెరుగుతుంది. దీంతో శృంగార కోరికలు పెరిగి ఎక్కువ సేపు కలయికలో పాల్గొంటారు.
చర్మ నిగారింపును పెంచుతుంది: రొయ్యలు ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి (Skin Beauty) కూడా సహాయపడతాయి. రొయ్యలలో విటమిన్ బి 12, విటమిన్ ఏ ఉంటాయి. ఇవి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి. ఇవి రక్తకణాలను (Blood cells) శుభ్రపరిచి చర్మాన్ని తాజాగా మారుస్తాయి.
కండరాల నిర్మాణానికి సహాయపడతాయి: రొయ్యలలో ఉండే ప్రోటీన్లు (Proteins) మన శరీరంలోని కండరాల నిర్మాణానికి (Muscle building) కొత్త కణజాలం ఏర్పాటుకు సహాయపడతాయి.
బరువు తగ్గుతారు: రొయ్యలలో అతి తక్కువ ఫ్యాట్ (Very low fat) ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గుతారు (Lose weight).
రక్తహీనత సమస్య తగ్గుతుంది : రొయ్యలలో ఐరన్ (Iron) పుష్కలంగా ఉంటుంది. కనుక రక్తహీనత (Anemia) సమస్యలతో బాధపడేవారు రొయ్యలను తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
జ్ఞాపక శక్తి పెరుగుతుంది: రొయ్యలను తీసుకుంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరిచి మతిమరుపు (Forgetfulness) సమస్యలు తగ్గి జ్ఞాపకశక్తి (Memory), పెరుగుతుంది.
ఎముకలకు బలాన్ని అందిస్తాయి.: రొయ్యలలో క్యాల్షియం (Calcium), ప్రొటీన్లు (Proteins) పుష్కలంగా ఉంటాయి. ఇవి ముసలితనంలో వచ్చే ఎముకల బలహీనతను తగ్గించి ఎముకలకు బలాన్ని అందిస్తాయి.
నరాల బలహీనత తగ్గిస్తాయి: రొయ్యలలో ఉండే మెగ్నీషియం (Magnesium) నరాల బలహీనతను తగ్గిస్తాయి. శరీర దారుఢ్యానికి సహాయపడతాయి. కనుక తీసుకొనే డైట్ లో రొయ్యలు తెలుసుకోవడం మంచిది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది : రొయ్యలను తీసుకుంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. ఇవి రక్తపోటును (Blood pressure) కూడా అదుపులో ఉంచి గుండె జబ్బులను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా (Heart health) ఉంటుంది.
వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది: రొయ్యలలో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించి వ్యాధులతో (Diseases) పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. శరీర వ్యాధినిరోధక శక్తిని (Immunity) పెంచి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.