నెలకు రెండుసార్లు పీరియడ్స్ అవుతున్నాయా? కారణం ఇదే..!
రెగ్యులర్ గా పీరియడ్స్ అయ్యే వారు ఆరోగ్యంగా బాగున్నట్టు. కానీ కొంతమందికి రెండు సార్లు పీరియడ్స్ వస్తుంటాయి. మారుతున్న జీవనశైలే దీనికి ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తే..
ప్రతి 24-35 రోజులకు ఒక సారి పీరియడ్స్ వస్తుంటాయి. ఇది చాలా కామన్. ఇలా పీరియడ్స్ వస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. అయితే కొంతమందికి నెలకు రెండు సార్లు పీరియడ్స్ వస్తుంటాయి. దీంతో నాకు ఎలాంటి సమస్య ఉందోనని ఆడవారు కంగారు పడిపోతుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఇది ఆందోళన కలిగించే విషయమే. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హార్మోన్ల అసమతుల్యత
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు పీరియడ్స్ ను నియంత్రిస్తాయి. వీటి సమతుల్యతలో మార్పు వస్తే పీరియడ్ చక్రంలో కూడా మార్పులు వస్తాయి. దీంతో మీ పీరియడ్స్ సక్రమంగా ఉండవు. హార్మోన్ల అసమతుల్యతకు జీవనశైలి మార్పులు, జనన నియంత్రణ మాత్రలు, ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఈ కారణాల వల్ల హార్మోన్లలో మార్పులు వచ్చి నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తాయి.
థైరాయిడ్
థైరాయిడ్ గ్రంథిలో సమస్యల వల్ల నెలకు రెండుసార్లు పీరియడ్స్ రావొచ్చంటున్నారు నిపుణులు. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లలో మార్పుల వల్ల రుతుచక్రంలో మార్పులు వస్తాయి. థైరాయిడ్ వ్యాధి ఉన్న మహిళలకు ఇలా పీరియడ్స్ తరచుగా అవుతుంటాయి. అందుకే మీకు నెలకు రెండు సార్లు పీరియడ్స్ వస్తే థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. ఇది థైరాయిడ్ కు సంకేతం.
పెరిమెనోపాజ్
ఇది రుతువిరతికి ముందు వచ్చే సమస్య. ఈ సమస్య ఎక్కువగా 40 ఏండ్లు పైబడిన మహిళలకే వస్తుంది. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి. దీని వల్ల మీ పీరియడ్స్ నెలకు రెండుసార్లు రావొచ్చు. ఇది సహజమైన ప్రక్రియ.
పీసీఓఎస్
దీనిలో మీ గర్భాశయంలో తిత్తులు ఏర్పడతాయి. దీంతో మీ పీరియడ్స్ సక్రమంగా రావు. ఈ సమస్య వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో మీ పీరియడ్ చక్రం ప్రభావితమవుతుంది. ఇది నెలకు రెండుసార్లు పీరియడ్స్ రావడానికి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. అందుకే మీకు ఈ సమస్య ఉంటే హాస్పటల్ కు వెళ్లండి.
ఒత్తిడి
మన బిజీ లైఫ్ స్టైల్ లో స్ట్రెస్ సర్వసాధారణంగా మారిపోయింది. కానీ దీనివల్ల కూడా హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీంతో నెలకు రెండు సార్లు పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఇలా అవుతుంది. అందుకే ఎప్పుడూ ఇలా అయితే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి.