లైంగిక శక్తిని పెంచే అశ్వగంధతో ఇంకెన్నీ ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
అశ్వగంధ (Ashwagandha) ఆరోగ్యానికి దివ్యౌషధంగా సహాయపడుతుంది. అందుకే దీనిని వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు (Nutrients) శరీరానికి కావలసిన శక్తిని అందించి అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అందుకే దీన్ని ఔషధం గని అని పిలుస్తారు. అయితే ఇప్పుడు మనం ఇది శరీరానికి కలుగజేసే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

అశ్వగంధను భారతీయ జిన్ సెంగ్ (Jin Seng) గా పిలుస్తారు. ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) కలిగిస్తుంది. దీనిని వాడితే శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండవచ్చని ఆధునిక నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతుంది.
ఒత్తిడి, బరువును తగ్గిస్తుంది: ఒత్తిడి (Stress) కారణంగా మనకు తెలియకుండానే ఆహారం ఎక్కువగా తీసుకుంటాం. అయితే అశ్వగంధను తీసుకుంటే ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గి ఫుడ్ క్రెవింగ్ కూడా తగ్గడంతో బరువు తగ్గుతారని (Lose weight) నిపుణులు చెబుతున్నారు.
మధుమేహాన్ని తగ్గిస్తుంది: మధుమేహగ్రస్తులకు (Diabetes) అశ్వగంధ దివ్యౌషధంగా సహాయపడుతుంది. ఇది శరీరంలోని హార్మోన్ల అసమతౌల్యంతో (Hormonal imbalance) ఏర్పడే మధుమేహ సమస్యలను నిరోధిస్తుంది. కనుక మధుమేహగ్రస్తులు దీన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నెలసరి సమస్యలను తగ్గిస్తుంది: స్త్రీలలో నెలసరి సమస్యలు, పీసీఓడీ (Pcod) వంటి ఇతర సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అలాగే మోనోపాజ్ (Monopause) సమయంలో తలెత్తే అనేక సమస్యలకు ఇది మంచి ఔషధంగా సహాయపడుతుంది.
లైంగిక శక్తిని పెంచుతుంది: రక్త ప్రసరణను పెంచి స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక శక్తి (Sexual energy) పెరిగేలా చేస్తుంది. అలాగే సంతానలేమితో (Infertility) బాధపడుతున్న పురుషులు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శుక్రకణాల శాతం పెరిగి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది: మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని (Memory) పెంచుతుంది. మతిమరుపుతో (Forgetfulness) బాధపడుతున్న వారు అశ్వగంధను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి దీన్ని సప్లిమెంట్లు లేదా టీ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు.
నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి: శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్య కారణం నిద్రలేమి (Insomnia) సమస్య కూడా ఒకటి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ అశ్వగంధ తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన (Anxiety) వంటి సమస్యలు తగ్గి నిద్ర బాగా పడుతుంది.
కీళ్లనొప్పులను తగ్గిస్తుంది: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి కీళ్ల నొప్పులు (Arthritis) ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ సమస్యను కూడా తగ్గించే గుణాన్ని అశ్వగంధ కలిగి ఉంటుంది. కనుక అశ్వగంధను తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఎముకలు దృఢంగా (Bones Strong) కూడా మారుతాయి.
క్యాన్సర్ ను అడ్డుకుంటుంది: అశ్వగంధ శరీరంలో క్యాన్సర్ కణాల (Cancer cells) వ్యాప్తిని అరికట్టే గుణాన్ని కలిగి ఉంటుంది. దీంతో రకరకాల క్యాన్సర్ (Cancer) ల బారిన పడకుండా అడ్డుకుంటుంది. ఇలా అశ్వగంధ శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.