MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: వర్షాకాలంతో పాటు వచ్చే వ్యాధులకు భయపడుతున్నారా.. అయితే వంటింటి వస్తువులతో చెక్ పెట్టండిలా?

Health Tips: వర్షాకాలంతో పాటు వచ్చే వ్యాధులకు భయపడుతున్నారా.. అయితే వంటింటి వస్తువులతో చెక్ పెట్టండిలా?

Health Tips: వర్షాకాలం రాగానే సీజనల్ వ్యాధులు పిలవకుండానే వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలకి, ముసలి వాళ్లకి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే వంటింటి వస్తువులతో ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు అది ఎలాగో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 21 2023, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా వర్షాకాలం రాగానే వెంటనే వచ్చే సమస్య జలుబు, దగ్గు. అందుకే వేడినీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగటం వలన రాగనిరోధక శక్తి పెరుగుతుంది. కోల్డ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలాగే వేడి పాలలో కొంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళల్లో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. యాంటీబయోటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి.
 

36

అలాగే జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగటం వల్ల మంచి ఒక ఉపశమనం లభిస్తుంది. అల్లం లోని ప్రత్యేక గుణాలు జలుబు, దగ్గు ని తగ్గిస్తుంది. లేదంటే వేడి నీటిలో నిమ్మరసం, తేనే కలిపి చివరిగా కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించి ఆ హెర్బల్ టీ తాగినా కూడా గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

46

గొంతు నొప్పి ప్రారంభమవుతుంది అనిపిస్తున్నప్పుడు మిరియాలతో కాషాయం చేసుకొని తాగిన.. లేదంటే పాలలో మిరియాల పొడి కలుపుకొని తాగిన మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులను నిమ్మ తేనెను చేర్చాలి.
 

56

జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పెరుగు, తృణధాన్యాలని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అలాగే ముక్కు దిబ్బడగా అనిపించినప్పుడు ఎక్కువగా ఆవిరి పెట్టడం చేస్తూ ఉండండి. రోజంతా గోరువెచ్చని నీరు మాత్రమే తాగండి.
 

66

గొంతు నొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి పుకలించి ఉమ్మి వేయండి. ఇలా చేయటం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆహారంలో ఎక్కువగా వెల్లుల్లి ఉపయోగించండి. వెల్లుల్లి జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే పుదీనా కూడా ఎక్కువగా ఉపయోగించండి. ఇది సహజమైన డీ కాంగెస్టెంట్ కాబట్టి జలుబు, ఫ్లూ తో పోరాడటానికి సహాయపడుతుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Recommended image3
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved