Health Tips: పిల్లలలో కిడ్నీ మార్పిడి ఎప్పుడు అవసరమో తెలుసా?
Health Tips: కిడ్నీ మార్చటం అనేది సాధారణమైన విషయం కాదు. అందులోనూ పిల్లల కోసం అంటే అది మరింత సవాల్తో కూడిన చర్య. కిడ్నీ మార్చడం అనేది ఎప్పుడు చేస్తారు దాని గురించి కొంత అవగాహన పెంచుకుందాం.

కొందరిలో కిడ్నీ వ్యాధి అనారోగ్య కారణాల వల్ల వస్తుంది. కానీ కొందరికి పుట్టుకతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది లేకపోతే బాల్యంలో సంక్రమిస్తుంది. పీడియాట్రిక్ కిడ్నీ వ్యాధి, పోలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి పుట్టుకతో వచ్చే మూత్రపిండాల వైకల్యానికి దారి తీయవచ్చు. వీటిని సకాలంలో గుర్తించడం చాలా కీలక లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
ఆహారంలో జాగ్రత్తలు డయాలసిస్ వల్ల తీవ్రత తగ్గుతుంది కానీ జీవన నాణ్యత పెరుగుదలను పునరుద్ధరించడానికి కిడ్నీ మార్పిడి ఉత్తమ ఎంపిక. అందుకోసం కిడ్నీ దాత యొక్క అనుకూలత అవసరం.
ముఖ్యంగా కుటుంబ సభ్యుల కిడ్నీ మ్యాచ్ అయితే పర్వాలేదు. లేదంటే చనిపోయిన దాతల మార్పిడి కార్యక్రమం కోసం బిడ్డను వేచి ఉంచే జాబితాలో ఉంచవచ్చు ఇది అవసరమైన చాలా మంది పిల్లలకు ఆశ ను అందిస్తుంది.
పిల్లలలో మూత్రపిండా మార్పిడి కి ముందు ఆ పిల్లవాడికి ఆ కుటుంబ సభ్యుల యొక్క మానసిక స్థితి దృఢంగా ఉండేలాగా చూసుకోవాలి. మానసికంగా బలహీనులైనట్లయితే సైకియాట్రిస్టులను సంప్రదించవచ్చు. పిల్లలలో మూత్రపిండ మార్పిడి అనేది ప్రత్యేకమైన సవాలుతో కూడుకున్న వ్యవహారం.
ఎందుకంటే వారి శరీరాలు చిన్నవిగా ఉండి పెరుగుతున్న పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆపరేషన్ తరువాత పిల్లలు వారి జీవన నాణ్యతలో విశేషమైన మెరుగుదలను అనుభవిస్తారు.
మూత్రపిండ మార్పిడి యొక్క దీర్ఘకాలిక విజయాన్ని నిర్ధారించటానికి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కేర్ చాలా ముఖ్యమైనది. సరేనా సమయంలో మందులు వేసుకోవటం జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వంటి వాటి వల్ల మనకి లభించిన రెండవ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళం అవుతాము.