శానిటరీ ప్యాడ్స్ కొంటున్నారా? అయితే వీటిని గుర్తుంచుకోండి.. లేదంటే?
ప్యాడ్స్ కొనడానికి ముందు వాటి పరిమాణం నుంచి రక్తప్రవాహం వరకు ఎన్నో విషయాలను గుర్తుంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే..

పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే రుతుక్రమ పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. సెంటర్ ఫర్ యంగ్ ఉమెన్స్ హెల్త్ ప్రకారం.. వాకింగ్, రన్నింగ్, ఇతర రకాల వ్యాయామం లేదా కార్యకలాపాలు పీరియడ్స్ సమయంలో దద్దుర్లు రావడానికి దారితీస్తాయి. ఇది యోని ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. అందుకే ప్యాడ్లను కొనేటప్పుడు మనం చాలా విషయాలను గుర్తుంచుకోవాలి. రక్త ప్రవాహాన్ని బట్టి ప్యాడ్ ను కొనాలి. అంతేకాదు దాని పరిమాణం నుంచి ఫ్యాబ్రిక్ వరకు ప్రతిదాన్ని చెక్ చేయాలి. శానిటరీ ప్యాడ్స్ కొనే ముందు ఏమి గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల ప్రకారం.. ప్యాడ్ లో రసాయనాలు, బ్లీచింగ్ ఏజెంట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది యోనికి హానికరమని రుజువు చేయబడింది. అలాగే మీరు వాడే ప్యాడ్ లో ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చర్మంపై దద్దుర్లు, చెమట సమస్యలు వస్తాయి. ప్యాడ్లు కృత్రిమంగా ఉండకూడదు. ప్యాడ్ ఎప్పుడూ శ్వాసించేదిగా ఉండాలి. అలాగే మీ శరీర పరిమాణాన్ని బట్టి ప్యాడ్ పరిమాణాన్ని ఎంచుకోవాలి. వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మీ యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్యాడ్ ను కొనే ముందు ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలంటే..
ప్యాడ్ పరిమాణం
పీరియడ్ స్టార్టింగ్ లో రక్తప్రసరణ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారమే మనం ప్యాడ్ పరిమాణాన్ని ఎంచుకోవాలి. అలాగే పగలు, రాత్రిని దృష్టిలో ఉంచుకుని ప్యాడ్లను ఎంచుకోండి. పగటిపూట 17 సెం.మీ నుంచి 25 సెం.మీ ప్యాడ్ ను ఉపయోగించొచ్చు. ఇక రాత్రి పూట పెద్ద సైజు ప్యాడ్ ను ఉపయోగించాలి. ఎందుకంటే ఇది రక్త ఉత్సర్గను పూర్తిగా నియంత్రిస్తుంది. సైడ్ లీకేజీ ప్రమాదం ఉండదు.
శ్వాసించే పదార్థం
పత్తితో తయారు చేసిన ప్యాడ్లను వాడటం చాలా మంచిది. ఇవి మీకు సౌకర్యవంతంగా ఉంటాయి. మీ చర్మాన్ని బట్టి ప్యాడ్ ను ఎంచుకోండి. ప్యాడ్ పదార్థం పూర్తిగా శ్వాసించేలా ఉండేలా చూసుకోండి. దీంతో మీ శరీరం ఎరుపు, ఇంచింగ్ సమస్య నుంచి రక్షించబడుతుంది.
సామర్థ్యం
శానిటరీ ప్యాడ్ లను కొనే ముందు ప్యాడ్ కు తక్కువ సమయంలో ఎక్కువ నాణ్యతతో రక్తాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉందని తెలుసుకోండి. అలా కాకుండా లేచి కూర్చున్నప్పుడు రక్తం లీక్ అయ్యే అవకాశం ఉండే వాటిని అసలే కొనకండి. రక్తపు రంగును చూసి మీ ప్యాడ్ నాణ్యత ఉన్నదో? లేనిదో తెలుసుకోవచ్చు. రక్తం ఎరుపు రంగులో ఉంటే ప్యాడ్ రక్తాన్ని పూర్తిగా గ్రహించగలదని అర్థం.
చర్మ సున్నితత్వం
మీ చర్మం మృదువుగా ఉండి అలాగే లోపలి తొడలపై దద్దుర్లు వస్తే మీరు కాటన్ ప్యాడ్లు లేదా ములాయత్ ప్యాడ్లను ఉపయోగించండి. ఇది చికాకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ చేతితో తాకి ప్యాడ్ మృదుత్వాన్ని చెక్ చేయొచ్చు.
రక్త ప్రవాహం
మీ శరీర పరిమాణం, రక్త ప్రవాహం ప్రకారం ప్యాడ్ ను కొనాలి. మీకు బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే తదనుగుణంగా పరిమాణం, పదార్థాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు ప్యాడ్ ను మార్చడం కూడా మీ రక్త ప్రవాహంపై ఆధారపడి ఉంటుంది. మొదటి రోజు రక్తస్రావం ఎక్కువగా ఉంటే తదనుగుణంగా ప్యాడ్ ను ఉపయోగించండి. లాస్ట్ డేన బ్లీడింగ్ తక్కువగా ఉంటే తదనుగుణంగా ప్యాడ్ ను ఉపయోగించండి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
రోజంతా ఒకే ప్యాడ్ ను ఉపయోగించకూడదు. నిపుణులు ప్రకారం.. ప్యాడ్ ను రోజుకు 3 నుంచి 4 సార్లు మార్చాలి. ఇది బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.