MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • Health Benefits: జస్ట్ రూ.10 ఖర్చు పెడితే ఎన్ని వ్యాధులు తగ్గుతాయో తెలుసా?

Health Benefits: జస్ట్ రూ.10 ఖర్చు పెడితే ఎన్ని వ్యాధులు తగ్గుతాయో తెలుసా?

Health Benefits: చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా చాలా మంది రోజూ ఎన్నో మందులు వాడుతుంటారు కదా.. కాని మీరు ఓ రూ.10 ఖర్చు పెడితే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. రూ.10 లభించే మెడిసన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Feb 18 2025, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో చిన్నదో, పెద్దదో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొన్ని ప్రాణాంతకం కాకపోయినా రోజూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. గ్యాస్ట్రిక్, తలపోటు, గొంతునొప్పి, అలసట, కడుపు నొప్పి, కాళ్లు లాగడం, కళ్లు మంటలు ఇలా ఏదో ఒక ఇబ్బందితో చాలా మంది రోజూ మందులు వాడుతూ ఉంటారు. కాని మీ వంటింట్లో లభించే బేకింగ్ సోడాతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? బేకింగ్ సోడా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మార్కెట్ లో బేకింగ్ సోడా రూ.10 ప్యాకెట్లలో కూడా దొరుకుతుంది. వంటల్లో ఎక్కువగా ఈ పదార్థాన్ని ఉపయోగిస్తారు. అయితే గుండె, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, దంతాలు, చర్మం ఇలా అనేక భాగాలకు సంబంధించిన చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ను కేవలం బేకింగ్ సోడా ఉపయోగించి తగ్గించుకోవచ్చు. 

బేకింగ్ సోడా (Sodium Bicarbonate) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీనికి ఉండే ఆల్కలైన్ స్వభావం కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే దీన్ని కొద్దిగా, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది.

35

బేకింగ్ సోడా ఆరోగ్య ప్రయోజనాలు

యాసిడిటీని తగ్గిస్తుంది 
బేకింగ్ సోడా ఆల్కలైన్ స్వభావం కలిగి ఉండడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించేందుకు సహాయపడుతుంది.

ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఒక గ్లాసు నీటిలో అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకొని తాగాలి. వెంటనే ఉపశమనం కలుగతుంది. ఇలా రోజుకి ఒకసారి మాత్రమే చేయాలి.
 

45

యూరిక్ యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది 
మూత్ర పిండాలు రక్తంలోని మలినాలను ఫిల్టర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చర్య పర్ఫెక్ట్ గా చేయడానికి బేకింగ్ సోడాలోని ఎసిడిక్ నేచర్ సహాయపడుతుంది. అందువల్ల రక్తం ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది. మూత్రపిండాల పనితీరు పెంచడానికి, కిడ్నీ రోగుల మూత్రంలో ఆమ్లత్వాన్ని కంట్రోల్ చేయడానికి కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది.

చర్మ సమస్యలకు చెక్
బేకింగ్ సోడా ని గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేస్తే చర్మంపై దురద కలిగించే క్రిములను నాశనమవుతాయి. 

55

దంతాల శుభ్రత 
బేకింగ్ సోడా సహజమైన టూత్ పేస్ట్‌లా పనిచేస్తుంది. చిగుళ్ల సమస్యలు ఉన్న వాళ్లు, పళ్లు గార పట్టిన వాళ్లు బేకింగ్ సోడాతో దంతాలు తోముకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది పళ్లపై ఉన్న ప్లాక్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు ఉపయోగించే టూత్ పేస్ట్ లో బేకింగ్ సోడా కంటెంట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 

గొంతు నొప్పికి మంచి మందు
సాధారణంగా పొల్యూషన్, డస్ట్ ఎలర్జీ వల్ల చాలామంది తరచూ గొంతు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు కలిపి పుక్కళించడం ద్వారా గొంతు సమస్యలు తగ్గుతాయి.

అలా అని బేకింగ్ సోడాను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. సరిపడా మోతాదులో మాత్రమే వినియోగించాలి.  

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved