MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • యూత్ ఎనర్జిటిక్ గా , ఫిట్ గా ఉండేందుకు చిట్కాలు

యూత్ ఎనర్జిటిక్ గా , ఫిట్ గా ఉండేందుకు చిట్కాలు

International Youth Day : ఏ దేశ పురోగతి అయినా ఆ దేశ యువతపైనే ఆధారపడి ఉంటుంది. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత తమను తాము ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 12 2023, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ యువతపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఇందుకు యువత ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే వారు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. మరి యువత ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. ప్రతి ఏడాది ఐక్యరాజ్యసమితి ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. ప్రతి రంగంలో ఎదురయ్యే ఇబ్బందులను యువతకు తెలియజేసి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యువత ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శారీరక శ్రమ

హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం.. యువకులు రోజుకు 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ శారీరక శ్రమను ఖచ్చితంగా చేయాలి. రోజుకు 60 లేదా అంతకంటే ఎక్కువ నిమిషాలు మితంగా లేదా ఇంటెన్సివ్ గా ఉండాలి. దీనివల్ల మీ శ్వాస వేగం పెరుగుతుంది. అలాగే గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. మీరు వారానికి కనీసం 3 రోజులైనా శారీరక శ్రమ చేయాలి. యువకులు వారానికి కనీసం 2 రోజులు ఎక్కడం లేదా పుష్-అప్స్ వంటి కండరాలను బలోపేతం చేసే కార్యకలాపాల్లో పాల్గొనాలి. వారానికి కనీసం 3 రోజులు జంపింగ్ లేదా రన్నింగ్ వంటి ఎముకలను బలోపేతం చేసే కార్యకలాపాల్లో కూడా పాల్గొనాలి. 
 

37
Image: Getty Images

Image: Getty Images

ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం ఒక ముఖ్యమైన భాగం. ఆరోగ్యకరమైన అల్పాహారంతో పాటుగా రోజుకు 3   సార్లు భోజనం చేయండి. మీ ఆహారంలో ఫైబర్ ను పెంచి ఉప్పు వాడకాన్ని తగ్గించండి. నీళ్లను ఎక్కువగా తాగండి. చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలను నివారించడానికి ప్రయత్నించండి. పండ్ల జ్యూస్ లకు బదులుగా పండ్లనే తినండి. అలాగే వేయించిన ఆహారాలకు బదులుగా కాల్చిన లేదా ఉడకబెట్టిన వాటిని తినండి. వెన్న, స్పైసీ గ్రేవీలను తినకూడదు. చికెన్, చేపలను ఎక్కువగా తినాలి. రెడ్ మీట్ ను తక్కువగా తీసుకోవాలి. సన్నని మాంసాన్ని ఎంచుకోండి. గోధుమలు, బియ్యం, ఓట్స్, మొక్కజొన్న వంటి తృణధాన్యాలను కూడా తీసుకోండి. ముదురు ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగు కూరగాయలు, బీన్స్ తో సహా వివిధ రకాల కూరగాయలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం డ్రై ఫ్రూట్స్ ను తినండి.  ప్రాసెస్ చేసిన ఆహారం, సంతృప్త కొవ్వు, సోడియం, చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకండి. 
 

47

తగినంత నిద్ర

నిద్ర మనకు చాలా చాలా అవసరం. నిద్రలో ముఖ్యమైన శరీర విధులు, మెదడు కార్యకలాపాలు జరుగుతాయి. నిద్రపోకపోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది  ప్రాణాంతకం కూడా. శ్వాస తీసుకోవడం, నీరు తాగడం, తినడం ఎంత ముఖ్యమో నిద్ర కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యం. ప్రతి రాత్రి సుమారు 8 నుండి 9 గంటలు నిద్రపోవాలి. వారమంతా క్రమం తప్పకుండా నిద్ర విధానాలను అనుసరించండి. వారాంతాల్లో ఆలస్యంగా నిద్రపోవడానికి బదులుగా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. అలాగే నిర్ణీత సమయంలో మేల్కోవాలి.
 

57
Stress

Stress

ఒత్తిడి నిర్వహణ

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీ భావోద్వేగ అవగాహనను మెరుగుపరుచుకోండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం నేర్చుకోండి. లోతైన శ్వాస, యోగా, ధ్యానం, వ్యాయామం, వంటి విశ్రాంతి పద్ధతులను అభ్యసించండి.
 

67

మద్యపానం, ధూమపానం

ఒత్తిడికి గురైనప్పుడు మందు, దకద్రవ్యాలను ఎప్పుడూ తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు, లైంగిక, మానసిక రుగ్మతలు, హైబీపీ, క్యాన్సర్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఎక్కువ ఆల్కహాల్ తాగే వ్యక్తులకు నైపుణ్యాలు, సమన్వయం, అప్రమత్తత లోపిస్తుంది.
 

77

స్క్రీన్ సమయాన్ని తగ్గించండి 

స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, గేమింగ్ కన్సోల్స్, టీవీలు, కంప్యూటర్లతో సహా స్క్రీన్లను చూడటంలోనే యువత ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. కానీ ఈ అలవాటు మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువ స్క్రీన్ టైమ్ నిద్ర సమస్యలు, లక్ష్యాలకు దూరం కావడం, తక్కువ పుస్తకాలు చదవడం, కుటుంబం, స్నేహితులతో తక్కువ సమయం గడపడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్, ఆత్మగౌరవం వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి 1-2 గంటలకు మించి స్క్రీన్ ను చూడకూడదు. నిద్రకు 1 గంట ముందే స్క్రీన్ ను చూడటం మానేయండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved