MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • యువత ఎదుర్కొంటున్న సాధారణ అనారోగ్య సమస్యలివి..! ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే

యువత ఎదుర్కొంటున్న సాధారణ అనారోగ్య సమస్యలివి..! ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే

పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలతో సహా ఎన్నో కారణాల వల్ల నేటి యువత ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న కొన్ని అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 12 2023, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


మారుతున్న జీవనశైలితో నేటి యువత ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తోంది. నిశ్చల అలవాట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినడం వంటి అలవాట్ల వల్ల  ఊబకాయంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అకాడమిక్ ఒత్తిడి, డిజిటల్ కల్చర్ కారణంగా యువతలో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యలు వారి మొత్తం శ్రేయస్సు, భవిష్యత్తు ఆరోగ్యంపై ఎంతో ప్రభావాలను చూపుతాయి. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతను ప్రభావితం చేసే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మానసిక ఆరోగ్య సమస్యలు 

యువతలో రోజు రోజుకు మానసిక ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. చదువులో ముందుండటానినకి, సామాజిక సంబంధాలను నిర్వహించడానికి, వ్యక్తిగత మార్పులను నావిగేట్ చేయడం వంటి వాటివల్ల యువతలో ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ మానసిక ఒత్తిడి ఎన్నో శారీరక సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. 
 

 

37

అనారోగ్యకరమైన జీవనశైలి

నిశ్చల జీవనశైలి, కేలరీలను ఎక్కువగా తీసుకోవడం, పోషకాల తక్కువున్న ఆహారాలకు తినడం వల్ల యువత సులువుగా ఊబకాయం బారిన పడుతున్నారు. అంతేకాదు ఇది హృదయ సంబంధ సమస్యలు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఇది డయాబెటిస్,  గుండె సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయడమే కాకుండా యుక్తవయస్సులో ఈ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శారీరక కార్యకలాపాలల్లో పాల్గొనడం, సమతుల్య ఆహారాలను తినడం,  స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వంటి అలవాట్లు ఈ అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. 
 

47
Image: Getty

Image: Getty

మాదకద్రవ్యాల దుర్వినియోగం

కౌమారదశలోనే మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ ను అలవాటు చేసుకుంటారు కొంతమంది పిల్లలు. మాదకద్రవ్యాల వాడటం.. వ్యసనం, బలహీనమైన అభిజ్ఞా పనితీరు, దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే యువతకు వీటి దుష్ప్రభావాల గురించి ముందుగానే అవగాహన కల్పించాలి. 
 

57

లైంగిక ఆరోగ్య సమస్యలు

సరైన సెక్స్ ఎడ్యుకేషన్, సురక్షితమైన సెక్స్ పద్ధతుల గురించి అవగాహన లేకపోవడం వల్ల అవాంఛిత గర్భాలు, లైంగిక సంక్రమణ అంటువ్యాధుల వ్యాప్తి, యువతలో సంబంధాల సమస్యలకు దారితీస్తుంది. ఎస్టీడీలు, అవాంచిత గర్భాల వ్యాప్తిని నిరోధించడానికి బాధ్యతాయుతమైన నిర్ణయాలను తీసుకోవడం ప్రోత్సహించడంతో పాటుగా ఖచ్చితమైన సమాచారం అవసరం. 
 

67

స్మార్ట్ ఫోన్

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం వల్ల నిద్ర విధానాలకు భంగం కలుగుతుంది. ఇది కంటి ఒత్తిడికి దారితీస్తుంది. అలాగే మనుషులకు మనుషుకు మాటలు కూడా తగ్గుతాయి. ఇది మిమ్మల్ని సమాజానికి దూరం చేస్తుంది. అంతేకాదు నిద్రలేమి, అభిజ్ఞా పనితీరు, మానసిక స్థితి,మీ  మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి డిజిటల్ వస్తువుల వాడకాన్ని తగ్గించేలలా చూడాలి. వారితో ముఖాముఖి మాట్లాడటానికి ప్రయత్నించాలి. 

77


ఈ ఆరోగ్య సమస్యలను దూరం చేసే చిట్కాలు

యవ్వనంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య పోషకాహారం, రెగ్యులర్ వ్యాయామం, తగినంత నిద్రకు ప్రాధాన్యతనివ్వండి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పానీయాలను తగ్గించండి. 

హైడ్రేటెడ్ గా ఉండండి. ధ్యానం లేదా అభిరుచులు వంటి కార్యకలాపాల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. 

స్మోకింగ్, ఆల్కహాల్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూస్తున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోండి. అలాగే విశ్రాంతి తీసుకోండి. 

గేమ్స్, డ్యాన్స్ లేదా వాకింగ్ వంటి మీరు ఆనందించే వాటిలో  క్రమం తప్పకుండా పాల్గొనండి. శారీరక శ్రమ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. 

ఎస్టీఐలను నివారించడానికి సురక్షితమైన సెక్స్ ప్రాక్టీస్ చేయండి.

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved