Health Tips: పిల్లల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా.. అయితే రోగనిరోధక శక్తి కోసం ఇలా చేయండి?
Health Tips: ఇన్ఫెక్షన్లు పెద్దలకంటే పిల్లలకే ఎక్కువగా వస్తూ ఉంటాయి. వచ్చాక నివారించుకోవడం కన్నా రాకముందే జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. అందుకే పిల్లలకి రోగనిరోధక శక్తి కోసం ఏం చేయాలో చూద్దాం.
ఆడుకునే పిల్లలు సరి అయిన శుభ్రత పాటించకపోవడం వలన, సరియైన పోషకాహారం లేకపోవడం వలన తరచుగా ఇన్ఫెక్షన్లకి గురి అవుతూ ఉంటారు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్ శాతం చాలా తక్కువ కాబట్టి రోగనిరోధక శక్తి కోసం బలమైన ఆహారం తీసుకోవడం మంచిది.
సంపూర్ణ పోషకాలు ఉండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది ఇందులో ఉండే విటమిన్ డి,జింక్ సెలీనియం, విటమిన్ ఈ వంటి పోషకాలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే సాల్మన్ చేపలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
ఇది నొప్పి నివారించే పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అంతేకాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా తోడ్పడుతుంది. బాదం లో విటమిన్ ఈ మ్యాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది రోజు ఉదయాన్నే కొన్ని బాధలు గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు తినడం వలన హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షణ కల్పిస్తాయి సులభంగా జీర్ణం అయ్యే ఈ ఆహారం మంచి డైట్ గాను ఉపయోగపడుతుంది. పిల్లల పెరుగుదలకు విటమిన్ ఏ జింక్ చాలా ముఖ్యము.
ఇవి క్యారెట్లలో ఎక్కువ ఉంటాయి అందుకే ఆహారంలో క్యారెట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి. అలాగే ఆయుర్వేద మూలికలైన యష్టిమధు, గుగ్గుళ్ళు, గుడుచి వంటి వాటిని డాక్టర్ల సూచన మేరకు పిల్లలకి ఇస్తుంటే రోగ నిరోధక శక్తి పెరగటంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
అలాగే పిల్లలకి శుభ్రత నేర్పించండి. అవసరమైన నిద్రని ప్రశాంతమైన నిద్రని వారికి అందించండి నిద్రలేమి కూడా పిల్లల్లో రాగ నిరోధక శక్తి తగ్గటానికి కారణం అవుతుంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ పిల్లల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.