ఆహారాన్ని ఇలా తింటే ఒత్తిడి గురవ్వడం ఖాయం.. కారణం ఏమిటంటే?
ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో మనం తీసుకునే ఆహారం (Food) మన ఆరోగ్యంపై ప్రభావితం (Affected) చూపుతుంది. వేళకి భోజనం చేసినా ఆకలి వేయడం, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అయితే ఇలాంటి సూచనలు ఉంటే అది ఒత్తిడికి సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఆహారాన్ని ఎలా తింటే ఒత్తిడి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..

ప్రస్తుత కరోనా సమయంలో చాలామంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇలా ఇంటి నుండి పని చేస్తూ బయటి వాతావరణానికి దూరంగా ఉంటూ ఉద్యోగ పనిలో మునిగిపోయి తీసుకునే ఆహారం పట్ల సరైన శ్రద్ధ చూపించడం లేదు. భోజనం వేళకి భోజనం చేసిన ఎక్కువగా ఆకలి వేయడం, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు వారు ఎక్కువగా జంక్ ఫుడ్స్ (Junk Foods) ను, ఫాస్ట్ ఫుడ్ (Fast food) ను తినడానికి ఇష్టపడతారు.
వీటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు శరీరం ఒత్తిడికి (Stress) లోనవుతుంది. వీటి కారణంగా వారిలో తెలీని ఆందోళన (Anxiety), ఒత్తిడి, చికాకు, కోపం వంటి సమస్యలు ఏర్పడతాయి. చాలామంది చేసే పొరపాటు టీవీ, ఫోన్ చేస్తూ ఆహారాన్ని తింటుంటారు. వీటిని చూస్తూ వారి కడుపు నిండిన మనసు మాత్రం ఆకలి విషయంలో అసంతృప్తి గా ఉంటుంది.
కనుక ఆ తర్వాత కూడా వెంటనే ఆకలి (Hunger) వేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి అని పెద్దలు చెబుతారు. అప్పుడే మన మనసుకు సంతృప్తి కలిగి కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కనుక ఆహారాన్ని ఆస్వాదిస్తూ (Enjoying) వాటి రుచులను పొందగలిగితే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది.
మనం తీసుకునే ఆహార నియమాలే (Rules) మన ఆరోగ్యంపై ప్రభావితం చూపుతాయి. మరికొందరు ఆకలి వేస్తే ఏదో ఒకటి కడుపులోకి పోవాలని అన్నింటినీ నోట్లో వేసుకుంటారు. ఇలా చేయకూడదు. ఆకలి లేకపోయినా కాలక్షేపానికి (Pastime) ఏదో ఒకటి తినాలి అని ఆలోచిస్తారు. ఇది సరైన ఆలోచన కాదు అని వైద్యులు చెబుతున్నారు.
ఇలా ఆకలి వేసినప్పుడు ముందు ఒక గ్లాసు నీటిని తాగి కాసేపు ప్రశాంతంగా (Calm down) ఉండడానికి ప్రయత్నించాలి. తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తే ఆహారాన్ని తీసుకోవచ్చు. శరీరానికి కావలసిన నీటిని అందిస్తే ఒత్తిడి సమస్యలనుంచి దూరంగా ఉంచవచ్చు. మనది మనం తీసుకునే ఆహారంలో పోషకాలు (Nutrients) కలిగిన పదార్థాలను చేర్చుకోవడం మంచిది.
ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ ను, వేపుళ్లు తీసుకోరాదు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ బదులుగా స్నాక్స్ గా తాజా పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఒత్తిడి సమస్యలు నియంత్రించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని (Lifestyle) అలవర్చుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు పెద్దలు. కనుక మీ జీవన ప్రయాణంలో ఆరోగ్యాన్ని కంటూ ప్రత్యేక శ్రద్ధ (Attention) తీసుకోవడం తప్పనిసరి.