హైదరాబాద్ స్టైల్ లో పనీర్ 65 ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్!
పన్నీర్ తో అనేక మసాలా వంటలను వండుకుంటుంటాం. పన్నీర్ రెసిపీస్ ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే పన్నీర్ తో ఎప్పుడూ వండుకునే రెసిపీలకు బదులుగా ఈసారి హైదరాబాద్ స్టైల్ లో పనీర్ 65 ను ఒకసారి ట్రై చేద్దాం. ఈ స్నాక్ (Snack) రెసిపీ చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో సులభంగా ఈ స్నాక్ ను వండుకోవచ్చు. ఈ స్నాక్స్ మీ పిల్లలకు తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం హైదరాబాద్ స్టైల్ లో పనీర్ 65 (Paneer 65) ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: పావు కిలో పనీర్ (Paneer), సగం కప్పు పెరుగు (Curd), పావు కప్పు కార్న్ ఫ్లోర్ (Corn flour), రెండు టేబుల్ స్పూన్ ల మైదా (Maida), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక ఉల్లిపాయ (Onion), రెండు పచ్చి మిరపకాయలు (Green chillies), రెండు ఎండు మిరపకాయలు (Dry chillies), ఒక స్పూన్ వెల్లుల్లి (Garlic) తరుగు.
రెండు కరివేపాకు (Curry leaves) రెబ్బలు, పావు స్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక స్పూన్ కారం పొడి (Chilli powder), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), కొద్దిగా ఫుడ్ కలర్ (Food color), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, ఢీ ఫ్రైకి సరిపడా నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా పది నిమిషాల పాటు పన్నీర్ ముక్కలను వేడి నీటిలో (Luke warm water) నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత పన్నీర్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పన్నీర్ ముక్కలకు పిండి పట్టేలా బాగా కలుపుకొని (Mix well) పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత పన్నీర్ ముక్కలను వేసి మంచి కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా (Crispy) ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తరువాత వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఎండు మిరపకాయలు వేసి ఫ్రై (Fry) చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తరుగు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత కారంపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులో బాగా చిలికిన పెరుగు (Curd), కొన్ని చుక్కల ఫుడ్ కలర్ (Food color) వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు మరోసారి స్టవ్ ఆన్ చేసి పెరుగు మొత్తం బాగా ఫ్రై అయ్యి నీళ్లన్నీ ఆవిరి అయిపోయే వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని చివరిలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే క్రిస్పీ, స్పైసీ (Spicy) పనీర్ 65 రెడీ.