ఉసిరికాయలతో ఇలా చేశారంటే.. మీ జుట్టు మెరిసిపోవడం గ్యారెంటీ?
కలుషిత వాతావరణం, పోషకాహార లోపం కారణంగా జుట్టు సమస్యలు ఏర్పడతాయి. దీంతో జుట్టు పలుచగా, నిర్జీవంగా తయారవుతుంది. అధిక మొత్తంలో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం పొందడానికి ఉసిరికాయలు (Amla) చక్కని ఔషధంగా పనిచేస్తాయి. అందమైన జుట్టు సౌందర్యం పొందాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఉసిరికాయలతో జుట్టు సంరక్షణ (Hair care) ఏ విధంగా మెరుగుపడుతుందో తెలుసుకుందాం..

amla
ఉసిరికాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడంతో శరీర ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జుట్టు సంరక్షణ కూడా మెరుగుపడుతుంది. ఉసిరికాయలు జుట్టు సంరక్షణకు కావలిసిన ప్రోటీన్లను (Proteins) అందించి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. ఉసిరికాయలను సంస్కృతంలో ఆమ్లా, ధాత్రిఫలం (Dhatrifalam) అని కూడా అంటారు. ఉసిరికాయ ఔషధ గని. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి.
ఉసిరికాయలు ప్రోటీన్లు, విటమిన్ సి, పీచు క్యాల్షియం, కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), పొటాషియం వంటి ఖనిజలవణాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. ఉసిరిలో ఉండే ఔషధ గుణాలు జుట్టు కుదుళ్లు బలంగా చేసి, రాలడాన్ని అరికట్టి, ఆరోగ్యంగా మెరిసే శిరోజాల సౌందర్యం కోసం సహాయపడుతుంది. జుట్టు సంరక్షణకు ఉసిరి కాయలతో చేసిన ఆయిల్ మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఉసిరి కాయలతో నూనె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
amla
ఉసిరికాయలతో ఆయిల్ తయారీ విధానం: ముందుగా తాజా ఉసిరికాయలను (Amla) తీసుకుని శుభ్రపరచుకుని గింజలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఒక కప్పు కొబ్బరి నూనె (Coconut oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో మిక్సీ పట్టిన ఉసిరికాయ పేస్ట్ ను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఉసిరికాయల వేస్ట్ మంచి కలర్ వచ్చాక ఆయిల్ రంగు మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికించిన ఉసిరికాయ ఆయిల్ ను ఒక గిన్నెలోకి వడగట్టి (Filtered) ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు తలమాడుకు బాగా మర్ధన (Massage) చేసుకుని గంట తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడంతో జుట్టు సంరక్షణ మెరుగుపడుతుంది.
ఉసిరికాయ నూనెతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు: ఉసిరికాయలు జుట్టు రాలడాన్ని అరికట్టి ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. జుట్టు సౌందర్యాన్ని అందంగా, ఆరోగ్యంగా మలుచుకోవడానికి ఉసిరికాయల నూనెను (Amla oil) వాడడం మంచిది. ఉసిరికాయ నూనెతో మాడుకు మర్దన చేసుకుంటే రక్తసరఫరా (Blood supply) మెరుగుపడుతుంది. ఇవి జుట్టుకి కావలసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది.
కలుషిత వాతావరణం కారణంగా తలలో చేరుకున్న దుమ్ము, ధూళిని నివారించి తలను శుభ్రపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల (Infection) కారణంగా ఏర్పడిన చుండ్రు సమస్యను (Dandruff problem) తగ్గించి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జిడ్డు సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలను శాశ్వతంగా తగ్గిస్తుంది. జుట్టుకు మంచి రంగును అందించి నల్లగా మెరిసేలా చేస్తుంది.