మీ పొట్ట ఫాస్ట్ గా తగ్గాలంటే ఈ జ్యూస్ లు తాగండి
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. కానీ నడుం సైజు పెరిగే కొద్ది ప్రమాదకరమైన వ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే పొట్టను తగ్గించుకోవడానికి ఏ జ్యూస్ లు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
belly fat
సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వల్ల పొట్ట సైజు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంటుంది. శరీర బరువు కూడా విపరీతంగా పెరుగుతుంది. పొట్టు పెరగడం వల్ల బాడీ షేప్ మారడమే కాకుండా, మీకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయి.
చాలా మంది శరీర బరువును, పొట్టను తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలను వెతుకుతుంటారు. మీ పొట్ట, బరువు తగ్గాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల జ్యూస్ లను రోజూ తాగితే పొట్ట చాలా తొందరగా తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Belly Fat
ఏ జ్యూస్ లు పొట్టను తగ్గిస్తాయి
సొరకాయ జ్యూస్
సొరకాయ జ్యూస్ పొట్టను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది బరువును తగ్గించడానికి కూడా ఈ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది. ఈ సొరకాయ జ్యూస్ లో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీరు ఫాస్ట్ గా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి.
ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే పరిగడుపున సొరకాయ జ్యూస్ తాగితే మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మీ పొట్ట సులువుగా తగ్గుతుంది.
Lungs
కీరదోసకాయ జ్యూస్
కీర దోసకాయ జ్యూస్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో సోడియం అస్సలు ఉండదు. ఈ జ్యూస్ శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్స్ ను, అదనపు కొవ్వును సహజ పద్ధతిలో తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
క్రమం తప్పకుండా ఉదయాన్నే పరిగడుపున కీరదోసకాయ జ్యూస్ ను తాగితే మీరు హెల్తీగా బరువు తగ్గుతారు. పొట్ట కూడా తగ్గిపోతుంది. ఈ జ్యూస్ ను తయారుచేయడానికి కీరదోసకాయలతో నిమ్మకాయ, నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, పుదీనా కలపండి. ఇది కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
belly fat
కాకరకాయ జ్యూస్
బెల్లీ ఫ్యాట్ ను తొందరగా తగ్గించుకోవడానికి కాకరకాయ జ్యూస్ కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాకరకాయలో జ్యూస్ లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాకరకాయ రసం తాగితే రక్తంలో చక్కెరను కొవ్వుగా మార్చదు. అలాగే శరీర బరువును తగ్గించడానికి ఊబకాయాన్ని నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
ఆయుర్వేదంలో.. డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కాకరకాయ బాగా సహాయపడుతుందని పరిగణించబడుతుంది. అలాగే కాకరకాయలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.