దురద లేదా చర్మంపై దద్దుర్ల సమస్యా? అయితే ఈ చిట్కాలు మీకోసమే
వర్షాకాలంలో దురద, చర్మంపై దద్దుర్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలు ఈ సమస్యను తొందరగా తగ్గిస్తాయి.

skin itching
వర్షాకాలం వచ్చిందంటే చాలు మన శరీరం ఎప్పుడూ తేమగా ఉంటుంది. గాలిలో పెరిగే తేమ శరీర దురదకు కారణమవుతుంది. ముఖ్యంగా మెడ, ముఖం, చేతులు, అరికాళ్లు, అండర్ ఆర్మ్స్ లో దురద సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే సింథటిక్ దుస్తులు కూడా శరీర భాగాలలో దురదకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వేడి దద్దుర్లు రావడానికి కారణమవుతాయి. దీనివల్ల శరీరంలో ప్రతిచోటా ఎరుపు కనిపిస్తుంది. వాతావరణం మారడంతో వచ్చే ఈ దురదను నియంత్రించడానికి ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ సమస్య మాత్రం తగ్గదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు ఈ సమస్యను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెను జుట్టుకు మాత్రమే వాడుతుంటారు. కొబ్బరి నూనెతో జుట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే నెత్తి హైడ్రేట్ గా ఉంటుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. దీన్ని చర్మానికి కూడా ఉపయోగించొచ్చు తెలుసా. ఇది మన చర్మంపై దద్దుర్లు రాకుండా కాపాడుతుంది. నేచురల్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించే కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాదు ఇది చర్మంలో ఫిలాగ్రిన్ మొత్తాన్ని పెంచుతుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే పీహెచ్ సమతుల్యతను కూడా కాపాడుతుంది. కొబ్బరి నూనెను అప్లై చేయడానికి ముందు అందులో కర్పూరాన్ని వేయండి. తర్వాత దానిని దురద పెట్టే ప్లేస్ కు అప్లై చేయండి. రాత్రి పడుకునే ముందు, స్నానం చేసిన తర్వాత చర్మానికి అప్లై చేయాలి.
కలబంద గుజ్జు
అలెర్జీలు లేదా ఏ రకమైన దురదనైనా తగ్గించుకోవడానికి కలబంద బాగా సహాయపడుతుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చల్లగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో మంట, ఎరుపును తగ్గిస్తాయి. దీన్ని వారం రోజుల పాటు వాడటం వల్ల చర్మంలో మార్పు వస్తుంది. అలాగే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ ఏజింగ్ సమస్యను కూడా పరిష్కరిస్తుంది.
ముల్తానీ మిట్టి
ముల్తానీ మట్టి చల్లగా ఉంటుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం చల్లగా అవుతుంది. రెండు టీస్పూన్ల ముల్తాలీ మిట్టిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. చికాకు, దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది చర్మంపై ఉండే అదనపు నూనె సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడుతుంది. దీన్ని చర్మానికి అప్లై చేసి 5 నుంచి 7 నిముషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. మీ చర్మం ఇప్పటికే పొడిగా ఉంటే ముల్తీని మట్టిని తొలగించిన తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఈ నేచురల్ క్లెన్సర్ ను వారానికి 2 నుంచి 3 సార్లు చర్మానికి అప్లై చేయాలి.
neem leaves
వేప ఆకులు
వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మారుతున్న వాతావరణం వల్ల మీరు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే వేప ఆకులను నీటిలో మరిగించి దురద, ఎరుపును నివారించుకోవచ్చు. ఇందుకోసం నీటిలో వేపాకులను 10 నుంచి 15 నిమిషాలు మరిగించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నీరు చల్లబడేదాక వెయిట్ చేయండి. నీరు చల్లబడిన తర్వాత,ప్రభావిత శరీర భాగాలను నీటిలో ముంచండి. ఇది మీకు తక్షణ ప్రయోజనాలను ఇస్తుంది.
Image: Getty Images
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ వెనిగర్ లో ఆమ్ల మూలకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని దద్దుర్లు, దురద నుంచి రక్షిస్తాయి. శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లు తొలగిపోవాలంటే ఆపిల్ వెనిగర్ ను కాటన్ సహాయంతో చర్మానికి అప్లై చేసి కాసేపటి తర్వాత కడిగేయాలి. ఇది చర్మంపై పదేపదే దురద సమస్యను తొలగిస్తుంది.