వీటిని తింటే తలనొప్పి తగ్గుతుంది
తలనొప్పికి ఎన్నో కారణాలుంటాయి. శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గడం వంటి వివిధ కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. పుష్కలంగా నీటిని తాగడంతో పాటుగా కొన్ని ఆహారాలను తిన్నా తలనొప్పి తగ్గిపోతుందంటున్నారు నిపుణులు.
ఈ రోజుల్లో తలనొప్పి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఒత్తిడి, పనిభారం, నిద్రలేమి వంటి ఎన్నో కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. తలనొప్పి రోజంతా ఉంటుంది. దీనివల్ల ఎంతో చికాకు కలుగుతుంది. ఈ సమస్యతో ఏ పని సరిగ్గా చేయలేము. ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి మందులను కూడా వాడుతుంటారు. కానీ తరచుగా మందులను వాడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే కొన్ని ఆహారాలను తీసుకున్నా తలనొప్పి తగ్గిపోతుంనది నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ుంటాయి. ఇది తలనొప్పిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం అల్లాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించొచ్చు. అల్లం తురుమును నీటిలో కలుపుకుని తాగొచ్చు. లేదనుకుంటే అల్లం టీని తయారుచేసి అందులో నిమ్మరసం, తేనె కలుపుకోవచ్చు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది.
mint tea
పుదీనా టీ
పుదీనా టీ మన శరీరాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా నొప్పి నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. పుదీనాలో నొప్పిని తగ్గించే, శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. తరచుగా ఆందోళన, ఒత్తిడితో సమస్యలతో బాధపడుతున్నవారికి పుదీనా టీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కాఫీ
తలనొప్పితో బాధపడుతుంటే ఒక కప్పు కాఫీ ని తాగడం. ఇది మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. కెఫిన్ తలనొప్పికి సమర్థవంతమైన చికిత్స.
పుచ్చకాయ
శరీరంలో వాటర్ లేకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా మీరు రోజంతా తగినంత నీటిని తాగకపోతే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి స్థాయిని సమతుల్యం చేయడానికి మీరు తగినంత మొత్తంలో వాటర్ కంటెంట్ ఉన్న ఆహారాలను తినండి. పుచ్చకాయలో 92% వాటర్ ఉంటుంది. అలాగే పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. ఇది శరీరంలో నీటి కొరతను పోగొడుతుంది.
కొవ్వు చేపలు
తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొవ్వు చేపలు బాగా సహాయపడతాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఈ చేపలు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి.
పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. ఈ ఆహారాలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Image: Getty Images
కొబ్బరి నీరు
కొబ్బరి నీళ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్-సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.