అన్నం తిన్నా బరువు పెరగొద్దంటే ఇలా చేయండి
బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. అయితే అన్నం తిన్నా బరువు పెరగకూడదంటే మాత్రం మీరు కొన్ని పద్ధతులను ఫాలో అవ్వాల్సిందే.
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, నిశ్చల జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్లే బరువు బాగా పెరిగిపోతారు. అయితే చాలా మంది బరువు తగ్గాలని అన్నాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటే అన్నాన్ని తింటే బరువు పెరిగిపోతామని అనుకుంటారు. ఎందుకంటే అన్నంలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కానీ అన్నాన్ని కొన్ని విధాలుగా తింటే మీరు బరువు పెరిగే అవకాశమే లేదు.
అన్నాన్ని తినకపోతే చాలా మందికి కడుపు నిండిన భావన కలగదు. రోటీ, పరాఠా లేదా పూరీ తినాలనిపించినప్పుడు అన్నాన్ని తేలికపాటి భోజనంగా తీసుకోవచ్చు. కానీ బరువు పెరిగిపోతామని చాలా మంది అన్నం తినకుండా ఉంటారు. మరి అన్నం ఎలా తింటే బరువు పెరగరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ బరువును బాగా పెంచుతాయి. కానీ బియ్యాన్ని మొత్తమే తినకుండా ఉండటానికి బదులుగా మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే బరువు పెరగకుండా జాగ్రత్త పడొచ్చు.
ప్రోటీన్ విషయంలో జాగ్రత్తలు
మీరు ఎంత తింటున్నారనే దానికంటే మీరు ఏం తింటున్నారో తెలుసుకోండి. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ ప్లేట్లో ఎక్కువ పిండి పదార్థాలు ఉంటే, మీరు తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదని అర్థం. అందుకే మీరు రెగ్యులర్ గా జున్ను, చికెన్, చేపలు లేదా ఇతర ప్రోటీన్లు ఉన్న ఆహారాలను తినండి. అలాగే మీ ప్లేట్ లో అన్నం తక్కువగా కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి.
బాస్మతి రైస్ తినండి
బియ్యంలో ఎన్నో రకాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి బాస్మతి రైస్ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. బాస్మతి రైస్ ను డైట్ లో చేర్చుకుంటే బరువు పెరిగే సమస్య అంతగా ఉండదు. బాస్మతి బియ్యంలో మనం రెగ్యులర్ గా తినే వైట్ రైస్ కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీన్ని తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అలాగే మీరు అతిగా తినకుండా ఉంటారు.