మన బాడీలో కాల్షియం తగ్గిందని గుర్తించేదెలా..?
నిద్రపోయి లేచిన చాలా సేపటి తర్వాత కూడా.. ఆవలింతలు వస్తూనే ఉంటయి. తిన్న తర్వా త కూడా నీరసంగానే ఉంటారు.
calcium
మన శరీరానికి కాల్షియం అనేది చాలా ముఖ్యం. కాల్షియం కారణంగానే మన బాడీకి మాత్రమే కాదు.. బ్రెయిన్ కి కూడా చాలా ముఖ్యం. మన మజిల్ స్ట్రెంత్ కి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో కాల్షియం లేకపోతే.. సరిగా నడవలేం..కూర్చోలేం.. చేతులు, కాళ్లు అన్నీ విపరీతంగా నొప్పులు వచ్చేస్తాయి. అసలు కాల్షియం ఉండటం వల్లే... రక్త నాణాళల్లోకి రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అయితే.. ఒక వయసుకి వచ్చే సరికి.. మనం సరైన ఆహారం తీసుకోక.. బాడీలో నుంచి కొద్ది కొద్దిగా కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. కానీ... చాలా మందికి.. తమ శరీరంలో కాల్షియం తగ్గింది అనే విషయం తెలియదు. కానీ... మనం దానిని కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు.
calcium deficiency
చాలా మంది విపరీతంగా చేతులు, కాళ్లు, ఎముకల నొప్పి వస్తేనే కాల్షియం తగ్గినట్లు అనుకుంటూ ఉంటారు. కానీ...కాల్షియం శరీరంలో తగ్గిపోతే.. మనకు విపరీతంగా నీరసంగా ఉంటుంది. విపరీతంగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. నిద్రపోయి లేచిన చాలా సేపటి తర్వాత కూడా.. ఆవలింతలు వస్తూనే ఉంటయి. తిన్న తర్వా త కూడా నీరసంగానే ఉంటారు.
calcium
అది మాత్రమే కాదు.. మజిల్స్ దగ్గర విపరీతమైన నొప్పి ఉంటుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లు... మోకాలు, మో చేతులు భరించలేని నొప్పిని కలిగిస్తాయి. సరిగా నడవనివ్వవు. చేతులతో ఏదీ గట్టిగా పట్టకోలేం. కనీసం ఆడవారికి అయితే.. వారి జడ వేసుకుంటున్నా నొప్పి పడుతుంది.
మన శరీరంలో నరాల వ్యవస్థ... శరీరంలోని అన్ని పార్టీలు కనెక్ట్ అయ్యి ఉండటానికి సహాయపడతాయి. అవి సరిగా పని చేయాలి అంటే బాడీలో కాల్షియం చాలా అవసరం. అదే కాల్షియం శరీరంలో లేకపోతే... చేతులు, కాళ్లు ఊరుకూరికే తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటాయి.
calcium deficiency
caఇక మన బాడీలో కాల్షియం ఉంది అనే విషయం తెలియాలంటే.. మన చేతి వేళ్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కాల్షియం తగ్గినప్పుడు.. చేతి వేలి గోర్లు.. పలచగా మారతాయి. ఇలా పట్టుకున్నా విరిగిపోతాయి.
calcium deficiency
మన శరీరంలో కాల్షియం సరిగా లేకపోతే.... దంతాల సమస్యలు కూడా వస్తాయి. గమ్ ప్రాబ్లమ్స్, దంతాలు ఊడిపోవడం, కదలడం, విరగడం లాంటివి జరుగుతాయి.
calcium deficiency
కాల్షియం లోపం కారణంగా మన మూడ్ స్వింగ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అంతలోనే సంతోషంగా ఉన్నా... వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఇరిటేటివ్ గా ఉంటుంది. యాంక్సైంటీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.